ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి

ABN, Publish Date - Jul 11 , 2025 | 01:21 AM

జిల్లా వ్యాప్తంగా వెలసిన పలు సాయిబాబా ఆలయాలలో గురువారం గరుపౌర్ణమి, వ్యాసపూర్ణమి పురష్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆత్మకూరులో రథాన్ని లాగుతున్న ప్రముఖులు, భక్తులు

నంద్యాల కల్చరల్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా వెలసిన పలు సాయిబాబా ఆలయాలలో గురువారం గరుపౌర్ణమి, వ్యాసపూర్ణమి పురష్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని సాయిబాబా ఆలయాలలో అన్నప్రసాదవిత రణ గావించారు. నంద్యాల నాగులకుంట రోడ్డు, బొమ్మలసత్రం, చాబోలురోడ్డులో, జంబులా పరమేశ్వరీ ఆలయం సమీపంలోని సాయిబాబా ఆలయాల్లో బాబాకు ప్రత్యేక పూజలు, ప్రత్యేక హారతులు ఇచ్చారు. విశ్వనగర్‌, జంబులా పరమేశ్వరి దగ్గరలోని సాయిబాబా ఆలయాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, సుగాలితాండలోని శ్రీచక్రపీఠంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పాల్గొని బాబాకు పూజలు నిర్వహించారు. బొమ్మలసత్రం దగ్గరలోని సాయిబాబా ఆలయంలో హోమాలు, బాబాకుపల్లకి సేవ కార్యక్రమాలునిర్వహించారు. బైటిపేట చౌడేశ్వరీ దేవి ఆలయంలో ఉన్న సాయిబాబా గుడి, సాంబవరం దగ్గర వున్న సాయిబాబాగుడి, కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో తదితర ఆలయాలో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. పాములేటిస్వామి ఆరఽశమం నందు యోగానంద ఆధ్వర్యంలో వేడుకలునిర్వహించారు.

ఆత్మకూరు: పట్టణంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం గురుపౌర్ణమి మహోత్సవం శోభయమానంగా సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఆత్మకూరు అర్బన్‌ సీఐ రాము ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే రథానికి పూజలు చేపట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే బుడ్డాను ఘనంగా సత్కరించారు. బీజేపీ నాయకురాలు మోమిన్‌ షబాన, టీడీపీ నాయకులు యుగంధర్‌రెడ్డి, వేణుగోపాల్‌, అబ్దుల్లాపురం బాషా, శివప్రసాద్‌రెడ్డి, రామ్మూర్తి తదితరరులు ఉన్నారు. గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం జిల్లాలో మరెక్కడ లేనివిధంగా ఆత్మకూరు పట్టణంలో జరిగిన శ్రీషిర్డీసాయినాఽథుని రథోత్సవ క్రతువుతో అత్యంత వైభవోపేతంగా జరిగింది.

మహానంది: మహానంది మండలం అల్లీనగరం గ్రామంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం ఆలయం అర్చకులు ప్రత్యేకంగా పూలతో బాబా విగ్రహాన్ని అలంకరించారు. పూజలతో పాటు అభిషేకాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. మధ్యాహ్నాం అష్టవిధ మహా మంగళహారతి సేవను నిర్వహించారు. హాజరైన వందలాదిమంది భక్తులకు అల్లీనగరంకు చెందిన తోటమ్మగారి రమణ అన్నదానం జరిపారు. ఆలయ నిర్మాణదాతలు శిలివేరు వేణుగోపాల్‌, వాణి దంపతులతో పాటు పలువురు ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

వెలుగోడు: పట్టణంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను గురువారం భక్తిశ్రద్ధతో నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకాలు, అర్చనలు, హారతులు నిర్వహించి భక్తిశ్రద్దలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకుడు బుడ్డా శేషారెడ్డి, మాజీ ఎంపీపీలు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

గడివేముల: మండలంలో గురువారం గురుపౌర్ణమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కరిమద్దెల, చిందుకూరు, గడివేములలోని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు. సాయంత్రం సాయిబాబా ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.

పాములపాడు: మండలంలోని జూటూరు గ్రామ శివార్లలోని శ్రీ షిర్డి సాయిబాబ ఆలయంలో శ్రీ నాగసాయి విద్యబ్రహ్మ ఆశ్రమం పీఠాదిపతి శ్రీ రామనందస్వామి గురు వ్యాస పౌర్ణమి ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, హారతులు నిర్వహించారు.

పగిడ్యాల: మండల పరిధిలోని నెహ్రూనగర్‌ గ్రామంలో సాయిబాబ ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను గురువారం భక్తులు ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయ నిర్వాహకులు విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలకరించారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

కొత్తపల్లి: మండలంలోని గువ్వలకుంట్ల గ్రామంలో వెలసిన షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు అశేష భక్తజనం మధ్య వైభవంగా జరిగాయి. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Updated Date - Jul 11 , 2025 | 01:22 AM