ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రంలో సుపరిపాలన

ABN, Publish Date - Jun 13 , 2025 | 01:38 AM

రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

నంద్యాలలో కేక్‌ కట్‌ చేస్తున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నంద్యాల టెక్కెమార్కెట్‌ యార్డులో మంత్రి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తో పాటు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి, మార్క్‌ ఫెడ్‌ డైరెక్టర్‌ తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై ఏడాది పాలన వేడుకలో పాల్గొన్నారు. ముందుగా కేకును కట్‌ చేశారు. మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరగని అభివృద్ధి ఈ ఏడాది కాలంలోనే జరిగిందన్నారు. ఎన్‌ఎండీ ఫిరోజ్‌, ఎన్‌ఎండీ ఫయాజ్‌, డాక్టర్‌ బాబన్‌, ఏవీఆర్‌ ప్రసాద్‌, రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 01:39 AM