మహానందిలో అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ ఆఫీసర్ పూజలు
ABN, Publish Date - Jul 05 , 2025 | 12:34 AM
మహానంది క్షేత్రంలో కడప జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ ఆఫీసర్ మదన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మదన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదిస్తున్న వేదపండితులు
మహానంది, జూలై 4(ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో కడప జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ ఆఫీసర్ మదన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయం వద్ద డీఆర్వో హైమవతి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రధాన ఆలయాల్లో మహానందీశ్వరునికి అభిషేకం, కామేశ్వరీదేవి అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. కల్యాణ మండపంలో వీరిని వేదపండితులు ఆశీర్వదించారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య శాలువాతో సన్మానించి, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాణా ప్రతాప్, బాషా పాల్గొన్నారు.
Updated Date - Jul 05 , 2025 | 12:34 AM