ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చంద్రబాబుతోనే రైతు సంక్షేమం: ఎమ్మెల్యే

ABN, Publish Date - Jul 19 , 2025 | 12:50 AM

సీఎం చంద్రబాబుతోనే రైతు సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుతోనే రైతు సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు కురిపించారని కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ హంద్రీనీవా సృజల శ్రవంతి కాలువకు సాగునీరు విడుదల చేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో ఎళ్ల నాటి కలను నెరవేర్చే దిశగా అడుగులు వేశారన్నారు. మిడ్తూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఆమోదం తెలిపి ఆ మండల రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువ విస్తరణ పనులను సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నెల రోజుల్లో పూర్తి చేశారన్నారు. హంద్రీనీవా సృజల స్రవంతి కాలువ 19వ కిలోమీటరు వద్ద రూ.60 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 6వేల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. నందికొట్కూరు మండలంలో మోడల్‌ ఏర్పాటుకు, ప్రస్తుతం 30 పడకలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని వందపడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఒప్పుకున్నారన్నారు. అలగనూరు రిజర్వాయర్‌ మరమ్మతులకు రూ.36 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామని సీఎం హామీ ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ వీరం ప్రసాద్‌రెడ్డి, కౌన్సిలర్‌ జాకీర్‌ హుస్సేన్‌, టీడీపీ నాయకులు ముర్తుజావళి, షకీల్‌ అహ్మద్‌, పలుచాని మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 12:50 AM