ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

ABN, Publish Date - Apr 18 , 2025 | 01:02 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. పాములపాడు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు

జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జయసూర్య

పాములపాడు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. పాములపాడు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జొన్న క్వింటం రూ.3,371 ప్రకారం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు గోనె సంచులు ఇస్తామని, హమాలీ, రవాణ చార్జీలు చెల్లిస్తామని తెలిపారు. రబీలో సాగుచేసిన జొన్న పంటకు ఈకేవైసీ చేయించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని వ్యవసాయశాఖ అధికారులను హెచ్చరించారు. ఎంపీపీ సరోజినీ వర్జీనియా, మార్క్‌ఫెడ్‌ డీఎం రాజ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ముంతాజ్‌, ఏవో ఫణీశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు హరినాథరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, సత్యంరెడ్డి, గోవిందు, నబీరసూల్‌, మోహన్‌గౌడ్‌ మల్లి కార్జున, ఏసేపు, అలీబాషా, రాము, జలాల్‌బాషా, ఉస్మాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 01:02 AM