ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలి

ABN, Publish Date - Jun 29 , 2025 | 12:15 AM

నంద్యాల పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ కోరారు.

సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల టౌన్‌ జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ కోరారు. పట్టణంలోని మున్సిపాలిటీని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి మాట్లాడుతూ అభివృద్ధికి సహకరించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కొత్తగా వచ్చిన కమిషనర్‌ శేషన్నతో సిబ్బంది ఎలా ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ పట్టాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేశామని, ఇంకా కొన్ని తుది దశలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఏవైనా పెండింగ్‌ ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆయన డీఈ గురప్ప యాదవ్‌, టూటౌన్‌ సీఐ ఇస్మాయిల్‌, ఎస్‌ఐ సురేశ్‌, పలువురు మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ సూచించారు. శనివారం మెప్మా కార్యాలయంలో సీఆర్పీలకు ఆయన ట్యాబ్‌లను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ మెరుగైన సేవలు అందించాలని సీఆర్పీలకు సూచించారు.

నంద్యాల రూరల్‌ : సర్వమానవాళి క్షేమం కోసం ప్రార్థించాలని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ సూచించారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ షాదీఖానా నుంచి శనివారం ఉమ్రా యాత్రకు వెళ్తున్న వారితో ఆయన మాట్లాడారు. యాత్రను దిగ్విజయం చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Updated Date - Jun 29 , 2025 | 12:15 AM