సంపాదిత సెలవులు మంజూరు చేయాలి
ABN, Publish Date - May 08 , 2025 | 12:05 AM
వేసవి సెలవుల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ 1938 యూనియన్ నాయకులు కోరారు.
డీఈవోకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు
నంద్యాల ఎడ్యుకేషన్, మే 7 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ 1938 యూనియన్ నాయకులు కోరారు. బుధవారం డీఈవో జనార్దన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు మాధవస్వామి మాట్లాడుతూ పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమీడియన్ తరగతులు తీసుకుని బోధిస్తున్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోవిందనాయక్, పోలియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 12:05 AM