ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బకాయిలు చెల్లించాలి

ABN, Publish Date - Apr 11 , 2025 | 01:11 AM

ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌ డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ డిపో వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులు

నందికొట్కూరు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. నందికొట్కూరు ఆర్టీసీ డిపో ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. సుధాకర్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న నైట్‌ అవుట్‌ అలవెన్సులను వెంటనే చెల్లించాలని, తగ్గించిన నైట్‌ అవుట్‌ అలవెన్సును రూ.150 నుంచి 300లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఎన్‌క్యా్‌షమెంట్‌ను వెంటనే చెల్లించాలన్నారు. గ్యారేజ్‌ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని, అక్రమ సస్పెన్షన్లు, అక్రమ రిమూవల్స్‌ని వెంటనే నిలిపివేయాలని, ఆగిపోయిన ప్రమోషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ విధానం ప్రకారం ఇవ్వవలసినటువంటి సెలవులను వెంటనే మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 01:11 AM