ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘అండర్‌ పాస్‌ బ్రిడ్జి వద్దు’

ABN, Publish Date - Mar 13 , 2025 | 12:52 AM

మండలంలోని ఎర్రగూడూరు గ్రామంలో హైవే నిర్మాణపు పనుల్లో భాగంగా తలపెట్టిన అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మాణపు పనులు వద్దని, గామాబివృద్ధిని అడ్డుకోవద్దంటూ గ్రామస్థులు హైవేపై నిరసన వ్యక్తం చేశారు.

ఎర్రగూడూరులో నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

పాములపాడు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రగూడూరు గ్రామంలో హైవే నిర్మాణపు పనుల్లో భాగంగా తలపెట్టిన అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మాణపు పనులు వద్దని, గామాబివృద్ధిని అడ్డుకోవద్దంటూ గ్రామస్థులు హైవేపై నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ప్రజలు మాట్లాడుతూ గ్రామంలో కొంతమంది వ్యక్తులు నేషనల్‌ హైవే అలైన్‌మెంట్‌లో లేని అండర్‌పాస్‌ బ్రిడ్జిని నిర్మించాలని రాజకీయ పలుకుబడితో పట్టుబట్టడం సమంజసం కాదని అన్నారు. నేషనల్‌ హైవే సేఫ్టీ కమిటీ సూచనలు పక్కకు పెట్టి అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మాణానికి మొగ్గు చూపడం దారుణమన్నారు. పాత డీపీఆర్‌ ప్రకారమే రోడ్డు నిర్మించాలని, పొలాలకు, శాంతినిలయం గ్రామం వెల్లేందుకు రహదారి నిర్మించాలని, ఏ ఊరిలో మారని అలైన్‌మెంట్‌ తమ ఊరిలో మాత్రమే ఎందుకు మారుతుందని ప్రశ్నించారు.

Updated Date - Mar 13 , 2025 | 12:52 AM