రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ
ABN, Publish Date - Jun 02 , 2025 | 01:12 AM
పట్టణంలో ఏర్పాటు చేసిన పలు రేషన్ దుకాణాలను పునః ప్రారంభించడంతో పాటు 65ఏళ్ల వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ సరుకులను పంపిణీ చేశారు.
ఆత్మకూరు, జూన్ 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఏర్పాటు చేసిన పలు రేషన్ దుకాణాలను పునః ప్రారంభించడంతో పాటు 65ఏళ్ల వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ సరుకులను పంపిణీ చేశారు. వైసీపీ దోపిడీలో భాగమే ఇంటింటికి రేషన్ విధానమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రంలో సుపరిపాలన ఉందని అన్నారు. శ్రీశైల నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిపై చర్చిం చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే శిల్పాకు సవాల్ విసిరారు. ఆత్మకూరు డిప్యూటీ తహసీల్దార్లు ఆంజనేయలు, మనోహర్, సివిల్ సప్లై డీటీ శ్రీనివాసులు, శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్, నాయకులు అబ్దుల్లాపురం బాషా, నబిరసూల్, రాజారెడ్డి, షాబుద్దిన్, ముర్తుజా తదితరులు ఉన్నారు.
నందికొట్కూరు: పట్టణంలోని పలు చౌకదుకాణాల్లో కార్డుదారులకు రేషన్‌ను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ టీడీపీ నాయకులు జమీల్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు రూరల్: పేదల కడుపు నింపే ప్రజాపంపిణీ వ్యస్థను ఒక క్రమ పద్దతిలో గాడిలో పెడతామని నందికొట్కూరు ఎమ్మె ల్యే జయసూర్య అన్నారు. ఆదివారం నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో డీలర్ల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను పునః ప్రారంభించి సరుకులను పంపిణీ చేశారు. తహసీల్దార్ శ్రీనివాసులు, మాండ్ర సురేంద్రనాథరెడ్డి, సర్పంచ్ చిన్న నాగలక్ష్మయ్య, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదిరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 02 , 2025 | 01:12 AM