ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కౌలు రైతులకు పంట రుణాలివ్వాలి

ABN, Publish Date - Jul 20 , 2025 | 12:07 AM

అన్ని బ్యాంకులు అర్హత కలిగిన కౌలురైతులకు పంట రుణాలివ్వాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రవీందర్‌కుమార్‌ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రవీందర్‌ కుమార్‌

నందికొట్కూరు రూరల్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): అన్ని బ్యాంకులు అర్హత కలిగిన కౌలురైతులకు పంట రుణాలివ్వాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రవీందర్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో నాబార్డు డీడీఎం కార్తీక్‌తో కలిసి ఆయన బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రవీందర్‌కుమార్‌ మాట్లాడుతూ బ్యాంక్‌లు కొనసాగిస్తున్న నియోజకవర్గ, మండల స్థాయి జనసురక్షా శిబిరాల్లో అధికారులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. బ్యాంకుల్లో ఖాతాదారుల పాతఖాతాల రీకేవైసీని మెరుగుపర్చాలన్నారు. పశుసంవర్ధక, మత్స్య, ఫైనాన్స్‌ ఆర్థిక సహాయం చేయాలని, పీఎంఎ్‌ఫబీవైౖకింద అర్హత కలిగిన పంట రుణాలను గడువులోపు కవర్‌ చేయాలన్నారు. నాబార్డ్‌ డీడీఎం కార్తీక్‌ మాట్లాడుతూ బ్యాంకులు రైతు ఉత్పత్తి దారుల సంస్థలకు, వ్యవసాయ కాలపరిమితి రుణాలు, వ్యవసాయ క్ల్లినిక్‌లు, వ్యాపార కేంద్రాలు, ఉద్యాన, పాడి పరశ్రమలకు ఆర్థిక సాయం మెరుగు పరచాలన్నారు. పీఎం ఎంయూఎ్‌ఫటీ బిజిలీ యోజన కింద ఆర్థిక సహాయానికి బ్యాంకులు మద్దతు ఇవ్వాలన్నారు. మహిళలకు ఎస్‌ఎ్‌సజీ ఫైనాన్స్‌ ను పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో మహిళల నేతృత్వంలోని ఎంటర్‌ ప్రైజెస్‌ ఫైనాన్స్‌ను కూడా మెరుగు పరచాలన్నారు. ఎంపీడీవో సుబ్రమణ్యశర్మ, డీపీఎం నంద్యాల రంగారావు, వివిధ శాఖల అధికారులు, బ్యాంక్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 12:07 AM