ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కౌన్సిల్‌ మీట్‌ రసాభాస

ABN, Publish Date - Jun 20 , 2025 | 12:28 AM

పట్టణంలోని సెంట్రల్‌ లైటింగ్‌ పనుల కోసం రూ.3కోట్లు మంజూరుపై సమావేశం నిర్వహిం చాలని, గత నెలలో తాను చెబితే కూడా ఎందుకు సమావేశం నిర్వహిం చలేదని, ప్రజా సమస్యలు పట్టవా? అని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య కమిషనర్‌ బేబిని ప్రశ్నించారు.

మున్సిపల్‌ కమిషనర్‌ను నిలదీస్తున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

నందికొట్కూరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సెంట్రల్‌ లైటింగ్‌ పనుల కోసం రూ.3కోట్లు మంజూరుపై సమావేశం నిర్వహిం చాలని, గత నెలలో తాను చెబితే కూడా ఎందుకు సమావేశం నిర్వహిం చలేదని, ప్రజా సమస్యలు పట్టవా? అని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య కమిషనర్‌ బేబిని ప్రశ్నించారు. ప్రస్తుతం కూడా మెజార్టీ కౌన్సిలర్లు ప్రతిపాదించిన తీర్మానాలను మాత్రమే ఆమోదించండి.. మిగిలిన వాటిని మీరు, మీ చైర్మన్‌ కలిసి ఆమోదించుకోండి ఆగ్రహం వ్యక్తంచేశారు. సభకు హాజరైన తమ వర్గం కౌన్సిలర్లు ఆమోదించిన 26 అంశాలతో పాటు టేబుల్‌ అజెండాలోని మరో 11 అంశాలను ఆమోదిస్తున్నట్లు సంతకాలు చేసి కమిషనర్‌ బేబికి అప్పగించారు. తీర్మానాలను ఆమో దించే సమయంలో సభలో ఎంత మంది ఉంటే వారిలో 3వ వంతు సభ్యులు ఉంటేనే తీర్మానాలను ఆమోదించాలని చైర్మన్‌ దాసి సుధాక ర్‌రెడ్డి కమిషనర్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ సభకు మొత్తం కౌన్సిలర్లు హాజరయ్యారని, అందులో అందరూ సంతకాలు చేశారని, వారిలో తమ వర్గం కౌన్సిలర్లు 3వ వంతు మెజార్టీ ఉన్నారంటూ సంతకాలు చేయించిన తీర్మానాల లేఖను కమిషనర్‌కు అందజేసి సభ నుంచి వెళ్లి పోయారు.

‘మెజార్టీ కౌన్సిలర్ల సమస్యలను మాత్రమే తీర్మానిస్తామంటే ఎలా?’

మెజార్టీ కౌన్సిలర్ల సమస్యలను మాత్రమే తీర్మానిస్తామంటే ఎలా? అని, తాము సమావేశానికి వచ్చి లాభమేమిటని 28వ వార్డు కౌన్సిలర్‌ రాధిక ప్రశ్నించారు. ఇలాగైతే తాము సభకు రాకుండా ప్రజల్లోకి వెళ్తామని అన్నారు.

‘మా వార్డు ప్రజలను పన్నులు అడగవద్దు’

తమ వార్డులోని సమస్యలను పరిష్కరించనప్పుడు తమ వార్డులోని ప్రజలను పన్నులు అడగవద్దని 7వ వార్డు కౌన్సిలర్‌ లాలుప్రసాద్‌ కమి షనర్‌ను హెచ్చరించారు. కమిషనర్‌ స్పందిస్తూ.. ప్రతి వార్డులో పన్నులు వసూళ్లు చేయడం తమ బాధ్యత అని, మీరు ఏమి చేయాలనుకున్నా రాతపూర్వకంగా ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

నేలపై బైటాయింపు

సమావేశంలో టేబుళ్లు ఎందుకు వేయలేదంటూ ఎంపీ బైరెడ్డి శబరి వర్గానికి చెందిన కౌన్సిలర్‌ చాంద్‌బాషా ప్రశ్నిస్తూ... నేలపై బైటాయించారు. వైసీపీ కౌన్సిలర్‌ అల్లూరి కృష్ణ, కోప్షన్‌ సభ్యుడు చికెన్‌ గఫార్‌ మద్దతుగా నిలిచారు. నందికొట్కూరు రూరల్‌ సీఐ సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకొని వారికి సర్దిచెప్పారు. ఎందుకు టేబుళ్లు వేయలేదని కమిషనర్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే టేబుళ్లు వేయించారు. దీంతో ఆ సమస్య సద్దుమణిగింది.

ఒక్కొక్కరుగా సభ నుంచి జారుకున్న కౌన్సిలర్లు

సమావేశం ప్రారంభం కాగానే లాక్‌బుక్‌లో సంతకాలు చేసి ఒక్కొక్క కౌన్సిలర్‌ సభ నుంచి వెళ్లి పోయారు. వైస్‌ చైర్మన్‌ ప్రశాంతి సంతకం చేసి ముందుగా వెళ్లి పోయారు. ఆ తర్వాత వైసీపీ కౌన్సిలర్‌ అల్లూరి కృష్ణ, ఆ తర్వాత ఎమ్మెల్యే వర్గానికి చెందిన నలుగురు మహిళా కౌన్సిలర్లు ఒకరి తర్వాత మరొకరు సభ నుంచి వెళ్లిపోయారు. అజెండా అంశాలను చదివే లోపే ఆరుగురు కౌన్సిలర్లు సమావేశం నుంచి వెళ్లి పోయారు.

Updated Date - Jun 20 , 2025 | 12:28 AM