ప్రజారోగ్యానికి సీఎం చంద్రబాబు కృషి
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:01 AM
ప్రజల ఆరోగ్యం కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కును పంపిణీ చేస్తున్న మంత్రి
నంద్యాల రూరల్, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యం కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాల మండలంలోని పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన నిర్మలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చిన రూ.1.5 లక్షల చెక్కును శుక్రవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ఎవరైనా నేరుగా వచ్చి సీఎం రీఫిల్ ఫండ్‌కు సంబంధించి దరఖాస్తు చేసు కోవచ్చని చెప్పారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 12:01 AM