అధికారులపై కేంద్ర బృందం ఆగ్రహం
ABN, Publish Date - Jul 26 , 2025 | 01:05 AM
గ్రామ పంచాయతీ, జాతీయ ఉపాధిహామీ పథకం రికార్డుల నిర్వాహణ సరిగా లేదని జాతీయ ఉపాధి హామీ కేంద్ర బృందం సభ్యులు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూపాడుబంగ్లా, జూలై 25(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ, జాతీయ ఉపాధిహామీ పథకం రికార్డుల నిర్వాహణ సరిగా లేదని జాతీయ ఉపాధి హామీ కేంద్ర బృందం సభ్యులు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూపాడుబంగ్లాలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కేంద్ర బృందం సభ్యులు గ్రామసభ సర్పంచ్ బాలయ్య అధ్యక్షతన నిర్వహించారు. గ్రామపంచాయతీలో ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై నిర్వహించాల్సిన గ్రామసభలు, తీర్మానాలు లేకపోవడంతో అధికారుల నిర్లక్ష్య వైఖరి అర్థమవుతోందని కేంద్ర బృందం లీడర్ సంతోష్‌కుమార్, సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023-24 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సంఘం నిధులు ఖర్చు, వివరాలు, తీర్మా నాలు, వార్డు సభ్యుల హాజరు, గ్రామసభల నిర్వహణకు సంబంధించిన రికా ర్డులు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇకపై రికార్డుల నిర్వాహణ సక్రమంగా నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోపీకృష్ణ, ఏపీడీ అన్వారాబేగం, ఏఈలు బషీర్, నాగేంద్ర, ఏపీవోలు గౌరిబాయి, రేష్మా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2025 | 01:05 AM