ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్సీగా బీటీ నాయుడు ఎన్నిక

ABN, Publish Date - Mar 18 , 2025 | 02:06 AM

ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా బీటీ నాయుడు ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, శాసనమండలి డిప్యూటీ సెక్రెటరీ వనితరాణి సోమవారం ధ్రువీకరణ పత్రం అందజేశారు.

ఎన్నికల అధికారి వనితరాణి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు

కర్నూలు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా బీటీ నాయుడు ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, శాసనమండలి డిప్యూటీ సెక్రెటరీ వనితరాణి సోమవారం ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ నెల 29తో ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఎన్నికలు నిర్వహించింది. ఐదు స్థానాలకు జనసేన, బీజేపీ అభ్యర్థులతో పాటు టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 12న విత్‌డ్రాల పర్వం ముగిసింది. ఒక్కో స్థానంలో నుంచి ఒక నామినేషన్‌ మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ధ్రువీకరణ పత్రం సోమవారం అందుకున్నారు. సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తనపై విశ్వాసంతో రెండో పర్యాయం అవకాశం ఇచ్చారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా శాసనమండలిలో తన వాణి విపిస్తానని తెలిపారు. డిక్లరేషన్‌ అందుకున్న బీటీ నాయుడు వెంట ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ఎమ్మెల్సీ అనురాధ, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, చిరంజీవి, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, అశోక్‌బాబు, దువ్వాడ రామారావు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 02:07 AM