ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డెంగీతో అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌వో

ABN, Publish Date - May 17 , 2025 | 12:50 AM

డెంగీతో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ ఆర్‌.వెంకటరమణ సూచించారు.

నంద్యాలలో ర్యాలీ చేస్తున్న వైద్యాధికారులు

నంద్యాల హాస్పిటల్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): డెంగీతో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ ఆర్‌.వెంకటరమణ సూచించారు. నంద్యాలలో జాతీయ డెంగీ నివారణ దినాన్ని పురస్కరించుకొని శుక్రవారం వైద్యాధికారులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నంద్యాల డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ప్రారంభమై సాయిబాబానగర్‌ ఆర్చి వరకు చేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పగలు కుట్టే దోమలు అత్యంత ప్రమాద కరమని, దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మలేరియా అధికారి రామేశ్వరరావు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటిస్తే డెంగీ దోమ ఉత్పత్తిని అరికట్టవచ్చన్నారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు అంకిరెడ్డి, సుదర్శన్‌ బాబు, కాంతరావునాయక్‌, సహాయ మలేరియా అధికారి రామవిజయ రెడ్డి, నంద్యాల సబ్‌ యూనిట్‌ అధికారి వెంకటేశ్వరరెడ్డి, మలేరియా కార్యాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు.

మహానంది: ఎం.తిమ్మాపురంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ వేణు కార్తీకేయ ఆధ్వర్యంలో డెంగీ నివారణ దినం సందర్భంగా సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఎంపీహెచ్‌ఈవో ఉసేన్‌రెడ్డి, పీహెచ్‌ఎన్‌ ఆమీనాభాయ్‌, సిబ్బంది చంద్రహారికర్‌, భార్గవి, అరుణ, స్వరూప పాల్గొన్నారు.

ఆత్మకూరురూరల్‌: బైర్లూటి గూడెంలో బైర్లూటి పీహెచ్‌సి వైద్య బృందం ఆధ్వర్యంలో జాతీయ డెంగీ నివారణ దినం సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి పవన్‌కుమార్‌, స్టాఫ్‌ నర్స్‌ షఫీవున్నీసా, ల్యాబ్‌ టెక్నిషియన్‌ సోమేశ్వరి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 12:50 AM