ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమెరికాతో ఒప్పందాలను రద్దు చేయాలి

ABN, Publish Date - Apr 22 , 2025 | 12:48 AM

భారతదేశంలోని వ్యవసాయ, పాడిపరిశ్రమ, మత్య్స రంగాలకు నష్టాలను కలిగించేలా అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి స్వాములు డిమాండ్‌ చేశారు.

నంద్యాలలో నిరసన తెలుపుతున్న నాయకులు

ఆత్మకూరు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): భారతదేశంలోని వ్యవసాయ, పాడిపరిశ్రమ, మత్య్స రంగాలకు నష్టాలను కలిగించేలా అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి స్వాములు డిమాండ్‌ చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ జేమ్స్‌ భారత పర్యటనను వ్యతిరేకిస్తూ సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారత ఎగుమతి, దిగుమతు లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారీగా సుంకాలు విదించడం సరికాదని అన్నారు. భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ సంఘం నాయకులు ఉన్నారు.

నంద్యాల రూరల్‌: భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులపైన అమెరికా విధిస్తున్న సుంకాలను తగ్గించాలని, భారత ప్రధాని మోదీ, ట్రంప్‌ మధ్య జరిగిన ఒప్పందాలను రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం సాయిబాబానగర్‌ సర్కిల్‌లో ఏపీ రైతు సంఘం, కార్మిక, వ్యవసాయ, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ మాట్లాడుతూ ట్రంప్‌తో ప్రధాని మోదీ చేసుకున్న ఒప్పందం మేరకు దేశ అభివృద్ధిని సైతం మరచిపోతున్నారని, మనదేశ సంపదను అమెరికాకు కొల్లగొట్టడానికి అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో తోట మద్దులు, నరసింహ, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

నందికొట్కూరు: అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌ భారత్‌ పర్యటనకు వస్తున్న సందర్భంగా వ్యతిరేకిస్తూ నందికొట్కూరు పట్టణంలో వామపక్షాల నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని ర్యాలీ నిర్వహించి అమెరికా ఉపాధ్యక్షుడు గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, రాజు, పక్కిర్‌సాహెబ్‌, గోపాలకృష్ణ, కర్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:49 AM