ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమాలకు పాల్పడితే చర్యలు

ABN, Publish Date - May 17 , 2025 | 12:51 AM

అక్రమాలకు పాల్పడినా, విధుల్లో నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) సంపత్‌కుమార్‌ హెచ్చరించారు.

మాట్లాడుతున్న సీడీఎంఏ సంపత్‌కుమార్‌

నంద్యాల టౌన్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): అక్రమాలకు పాల్పడినా, విధుల్లో నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) సంపత్‌కుమార్‌ హెచ్చరించారు. శుక్రవారం నంద్యాల పురపాలక కార్యాలయంలోని భవనంలో పురపాలక జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.వె య్యి కోట్లు పన్నులు వసూళ్లు చేయాలని టార్గెట్‌ ఉంటే రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో 80 శాతం పూర్తి చేస్తే నంద్యాలల్లో మాత్రం కేవలం 60 శాతం పూర్తి చేయడం ఏమిటని కమిషనర్‌ నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించారు. నంద్యాల పురపాలక సంఘం నుంచి ఎక్కువగా కాంట్రాక్టు వాహనాలు అడుగుతున్నారని, బిల్లులు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. చెత్త సేకరణ నిబంధనలు విరుర్ధంగా ఉందన్నారు. నంద్యాల మున్సిపల్‌ కమిషనర్‌ను మురుగు కాలువల పరిస్థితి ఎలా ఉందని అడగగా నంద్యాల బాగుందని చెప్పారు. వెంటనే సీడీఎంఏ స్పందిస్తూ కలెక్టరేట్‌ వద్ద మురుగు కాలువ చాలా అధ్వానంగా ఉందని అన్నారు. పన్నులు వసూలు చేయడంలో కానీ, పురపాలక సంఘానికి ఆదాయం వచ్చే మార్గాలను నిర్లక్ష్యం చేయకుండా డబ్బులు వృఽథా చేయకుండా అనవసరంగా బిల్లులు, కంట్రాక్టులు ఇచ్చి చేయకుండా డబ్బులు సేవ్‌ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం డోన్‌, ఆళ్లగడ్డ, ఆత్మకూరు వంటి పురపాలక సంఘాల్లో పని తీరు కూడా చుస్తున్నానని, వారు కూడా పనీ తీరు మార్చుకోవాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లోని మేజర్‌ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండకాలం అయిపోతున్న ఇంకా నీటి సమస్యలు ఉన్నాయని వాటిలో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడిగి వాటి రిపోర్టు తప్పనిసరిగా పంపించాలని చెప్పారు. పురపాలక సంఘాల్లో క్షేత్ర స్థాయిలో పని తీరు బాగాలేదని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. నంద్యాల కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటదాస్‌, ఎంఈ గురప్ప, ఆర్వో వెంకటరెడ్డి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 12:51 AM