ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనుమతి లేకుండా బోట్లు తిప్పితే చర్యలు

ABN, Publish Date - Jun 14 , 2025 | 01:31 AM

మండలంలోని శ్రీశైలం రిజర్వా యరులోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అనుమతులు లేనిదే మరబోట్లు తిప్పితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ ఉమారాణి బోటు నిర్వాహకులను హెచ్చరించారు.

బోటు నిర్వాహకులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ ఉమారాణి

కొత్తపల్లి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని శ్రీశైలం రిజర్వా యరులోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అనుమతులు లేనిదే మరబోట్లు తిప్పితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ ఉమారాణి బోటు నిర్వాహకులను హెచ్చరించారు. శుక్రవారం కొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో మండలంలోని సిద్ధేశ్వరం, జానాల, బలపాలతిప్ప, కపి లేశ్వరం, పాతమాడుగుల గ్రామాలకు చెందిన మరబోట్ల నిర్వాహ కులతో సమావేశం నిర్వహించారు. మరబోట్లకు లైసెన్సులు లేనివారు కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి లైసెన్సులు పొందాలని తెలిపారు. నదిలో మరబోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలనేది రూట్‌ మ్యాప్‌ కోసం ఇరిగేషన్‌ అధికారుల నుంచి అనుమతులు పొందాలన్నారు. అలాగే బోటుకు ఇన్సూరెన్స్‌ కూడా విజయవాడలో తీసుకోవాలని సూచించారు. అలాగే బోటు నడిపేవారు లైవ్‌ జాకెట్‌ ధరించి పరిమితి సంఖ్యలో ప్రయాణీకులను ఎక్కించుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ అరుణ, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 01:31 AM