ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

ABN, Publish Date - Mar 17 , 2025 | 01:09 AM

నంద్యాల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆదివారం పొట్టిశ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేస్తున్న సాయుధ బలగాల అడిషనల్‌ ఎస్పీ చంద్రబాబు

నంద్యాల క్రైం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆదివారం పొట్టిశ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా సాయుధ బలగాల అడిషనల్‌ ఎస్పీ జి.చంద్రబాబు పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌, ఆర్‌ఎస్‌ఐలు దాదాపీరయ్య, కాళీచరణ్‌, జిల్లా పోలీస్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల కల్చరల్‌: నంద్యాలలో ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సంజీవనగర్‌ కూడలిలో వున్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు భవనాశి నాగమహేష్‌, జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రదాన కార్యదర్శి బింగుమళ్ల శ్యామ్‌ సుందర్‌ గుప్తా, ఆర్యవైశ్య సంఘం నాయకులు బైసాని రామశేషు, సందీప్‌, పెట్రోల్‌బంక్‌ శ్రీను, జాగృతిక్లబ్‌ ఇంటర్నేషనల్‌ క్లబ్‌ ప్రసిడెంట్‌ వేణుగోపాల్‌, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

నంద్యాల మున్సిపాలిటీ: తెలుగు జాతి ఉన్నంతవరకు పొట్టి శ్రీరాములు జీవించే ఉంటారు ఆయన త్యాగం చిరస్మరణీయం అని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ అన్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సంజీవనగర్‌ కూడలిలో ఉన్న అమరజీవి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 01:09 AM