ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హామీలు నెరవేరుస్తున్న ప్రభుత్వం

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:47 PM

కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని టీడీపీ జిల్లా ప్రఽధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ అన్నారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎన్‌ఎండీ ఫిరోజ్‌

గోస్పాడు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ అన్నారు. మండలంలోని జూలేపల్లె గ్రామంలో ‘తల్లికి వందనం’ లబ్ధి పొందిన సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, నాయకులతో కలిసి గురువారం సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఒక విద్యార్థికి డబ్బులిచ్చి గొప్పలు చెప్పుకున్నారని, కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థు లుంటే అంతమందికి రూ.13వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేసిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగడం లేదన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాలు అన్ని కూడా అమలవు తాయని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకుల మాటలు నమ్మవద్దని ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వంవైపు ప్రజలు నిలబడాలని అన్నారు. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తులసీశ్వరరెడ్డి, గ్రామ నాయకులు ఓబుళరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:47 PM