ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

ABN, Publish Date - Jul 11 , 2025 | 01:24 AM

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

బలపనూరులో మొక్కను అందజేస్తున్న జేసీ విష్ణుచరణ్‌

పాణ్యం, జూలై 10(ఆంధ్రజ్యోతి): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మండలంలోని మోడల్‌ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోంచేశారు. పాఠశాల పరిధిలో మొక్కలు నాటారు. పాఠశాలకు రూ. 12 లక్షలతో త్వరలో ప్రహారీ పనులు ప్రారంభిస్తామన్నారు. జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకట సుబ్బారెడ్డి, ఎంఈవో కోటయ్య, సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ రంగరమేష్‌, ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్‌, హెచ్‌ఎం దినేష్‌బాబు, సీఐ కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌ రెడ్డి, పేరెంట్‌ కమిటీ చైర్మన్‌ రవినాయక్‌, టీడీపీ మండల కన్వీనర్‌ జయరామిరెడ్డి, నాయకులు రామ్మోహన్‌ నాయుడు, రమణమూర్తి పాల్గొన్నారు.

విద్యార్థుల అభివృద్దిలో తల్లిదండ్రుల బాధ్యతే కీలకమని జేసీ విష్ణు చరణ్‌ అభిప్రాయపడ్డారు. పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన పాణ్యం మండలం బలపనూరు జడ్పీ హైస్కూల్‌ పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తల్లిదండ్రులకు ఆయన మొక్కలు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో పాటు భోంచేశారు. సర్పంచ్‌ మాధవీలత, తహసీల్దారు నరేంద్రనాథ్‌ రెడ్డి, ఎంపీటీసీ వరలక్ష్మమ్మ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గోవర్ధన్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ రామిరెడ్డి, మాజీ ఎంపీపీ ఆదిశేషారెడ్డి, టీడీపీ నాయకులు శివశంకరరెడ్డి, ఆర్‌ఐ రాము, వీఆర్వో శంకర్‌, హెచ్‌ఎం నారాయణ పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన బియ్యం నిల్వలపై టీడీపీ నాయకులు శివశంకరరెడ్డి, యార్డు ఉపాధ్యక్షుడు చేసిన ఆరోపణలపై జేసి బియ్యం నిల్వలను పరిశీలించారు. విద్యార్థులకు ఇచ్చిన బియ్యం మినహా అధికంగా 50 కిలోల బియ్యం అదనంగా ఉండడంతోపాటు వాటి లెక్కల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో జేసీ హెచ్‌ఎం నారాయణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యం నిల్వలపై నివేదిక ఇవ్వాలని తహసీల్దారును ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికులను తాగునీటి మోటారుకు నిధులు ఇవ్వాలని హెచ్‌ఎం వేధిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు.

గడివేముల: కూటమి ప్రభుత్వంతోనే విద్యాభివృద్ధి సాధ్యమని టీడీపీ మండల కన్వీనర్‌ దేశం సత్యనారాయణరెడ్డి అన్నారు. మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ ఆత్మీయ సమ్మెళనంలో భాగంగా మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్‌ వెంకటరమణ, ఎంపీడీవో వాసుదేవగుప్తా, రాజరాజేశ్వరి హైస్కూల్‌ కరస్పాండెంట్‌ రామేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల కల్చరల్‌: నంద్యాల ప్రభుత్వ బాలికల పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ నిర్వహించారు. నంద్యాల బాలభవన్‌ విద్యార్ధులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

బండిఆత్మకూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల బంగారు భవిత ఒక టీడీపీకే సాధ్యమైందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం బండిఆత్మకూరు జడ్పీ హైస్కూల్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన విద్యా సామగ్రి, దుస్తులు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తల్లి దండ్రులు ఈ ప్రభుత్వాన్ని మరువకూడదన్నారు. నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

మిడుతూరు: కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందుతోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, మాడల్‌ స్కూల్‌లో మెగా పీటీఎం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గిత్తా జయసూర్య హాజరు అయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల బంగారు భవిషత్తుకోసం బడివైపు అడుగులు ముందుకు వేయాలని అన్నారు. తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో దశరథరామయ్య, ఎంఈవో ఫైజున్నీసా బేగం, మండల ప్రత్యేక అధికారి జాకీర్‌ హుశేన్‌, హెచ్‌ఎం సాయి తిమ్మయ్య, మాడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీదేవి, సర్పంచ్‌ జయలక్షమ్మ, టీడీపీ మండల కన్వీనర్‌ కాతా రమేష్‌ రెడ్డి, మార్కెట్‌యార్డు వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌, తువ్వా భగీరథరెడ్డి, సర్వోత్తమరెడ్డి పాల్గొన్నారు.

మహానంది: మండలంలోని పాఠశాలల్లో మెగా పీటీఎం నిర్వహించారు. బొల్లవరం జడ్పీ పాఠశాలలో హెచ్‌ఎం నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా కెసీ కెనాల్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షుడు బన్నూరి రామలింగారెడ్డి హాజరయ్యారు. మసీదుపురంలో టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జి నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి హాజరయ్యారు. తిమ్మాపురం మోడల్‌ స్కూల్‌లో పోలీసులు శక్తి యాప్‌ గురించి విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఎంపీడీఓ మహమ్మద్‌ దౌలా, ఎంఈవో రామసుబ్బయ్యల, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నంద్యాల రూరల్‌: పట్టణంలోని నూనెపల్లె పొట్టి శ్రీరాములు మోడల్‌ ప్రైమరీ స్కూల్‌లో పేరేంట్స్‌, టీచర్స్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు పేరుతో మొక్కలు నాటించారు. పలు క్రీడాపోటీలలో విజేతలైన విద్యార్థుల తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. ఎంఈవో బ్రహ్మంనాయక్‌ పాల్గొన్నారు.

విద్యారంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముస్లీం మైనార్టీ పైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మౌలానా షేక్‌ ముస్తాక్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. అయ్యలూరు గ్రామంలోని జపీహెచ్‌ఎస్‌ ఉర్దూ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశంలో పాల్గొన్నారు.

పాములపాడు: పాములపాడులోని మోడల్‌స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ నాగరవీంద్ర అఽధ్యక్షతన నిర్వహించిన పీటీఎం కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజ్‌, ఎంపీడీవో చంద్రశేఖర్‌, మండల టీడీపీ కన్వీనర్‌ రవీంద్రరెడ్డి, సీనియర్‌ నాయకులు తిమ్మారెడ్డి, హరినాఽథరెడ్డి, మధు, హుస్సేన్‌, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కేజీబీవీ, జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థుల విన్యాసాలు అలరించాయి.

కొత్తపల్లి: మండలంలోని పాఠశాలల్లో మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. గోకవరంలో హెచ్‌ఎం సుబ్బరాయుడు , ఉపాధ్యాయులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

నందికొట్కూరు: పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికలు హైస్కూల్‌, గాంధీ మెమోరియల్‌ హైస్కూల్‌లో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకర్‌రెడ్డి, మండల తహసీల్దార్‌ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంఈవో సుభాన్‌, హెచ్‌ఎం సావిత్రి, రామిరెడ్డి, కౌన్సిలర్‌ లాలుప్రసాద్‌, స్కూల్‌ కమిటీ చైర్మన్‌లు ఉమాదేవి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

హాజీనగర్‌లోని ఉర్దూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంఈవో సభాన్‌ పాల్గొన్నారు.

నందికొట్కూరు రూరల్‌: వడ్డెమాను జడ్పీ హైస్కూలులో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పీటీఎం 2.0 కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకుడు మాండ్ర లింగారెడ్డి, హెచ్‌ఎం జుబేదా, ఉపాధ్యాయులు ఆలీ హుశేన్‌, బీసన్న, నాగసుశీల, విద్యాకమిటీ చైర్మన్‌ మహ్‌మద్‌ హుశేన్‌ తదితరులు పాల్గొన్నారు.

పగిడ్యాల: మండంలోని పాఠశాలల్లో మెగా పేరెంట్‌, టీచర్స్‌ సమావేశాన్ని నిర్వహించినట్లు ఎంఈవో సుభాన్‌ తెలిపారు. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

జూపాడుబంగ్లా: పాఠశాల అభివృద్ధికి అందరం కలిసి పాటుపడుదామని యాదవ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ వెంకటేశ్వర్లుయాదవ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ అహ్మద్‌, తాటిపాడు హెచ్‌ఎం రవిశేఖర్‌, సర్పంచ్‌ లక్ష్మీదేవమ్మ అన్నారు. రాష్ట్రప్రభుత్వం గురువారం తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం పాఠశాలల్లో నిర్వహించారు.

ఆత్మకూరు: పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో గురువారం సంబరంగా మెగా పేరెంట్స్‌ మీటింగ్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆర్డీవో నాగజ్యోతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల ప్రత్యేక అధికారి తులసీదేవి, తోటగేరి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎంఈవో బాలాజీనాయక్‌ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుంకన్న, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నాగరాజు, తోటగేరి స్కూల్‌ హెచ్‌ఎం బాలస్వామి తదితరులు ఉన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1989-90 పదవ తరగతి పూర్వ విద్యార్థులకు రూ.1.7లక్షల విలువ చేసే ఫర్నీచర్‌ను పాఠశాలకు విరాళంగా అందజేశారు. ఇదిలావుంటే డిపౌల్‌ కిండర్‌ స్కూల్‌లో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ మోమిన్‌ షబాన, శ్రీపద్మావతి హైస్కూల్‌ నందు రిటైర్డు ఎంఈవో నాగేశ్వరరావు మెగా పేరెంట్స్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఆత్మకూరురూరల్‌: వెంకటాపురంలోని జడ్పీ హైస్కూల్‌లో మెగా పీటీఎం నిర్వహించారు. సర్పంచ్‌ గంగాదేవి, హెచ్‌ఎం లలిత కుమారి, కోఆప్షన్‌ సభ్యులు రాజేంద్రారెడ్డి, రమణారెడ్డి, ఉపాధ్యాయులు గాలిబ్‌, వెంకటరమణ, దాసు, పుష్పలత, కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 01:24 AM