Disaster Management: విపత్తుల డైరెక్టర్ రోణంకిపై బదిలీ వేటు
ABN, Publish Date - Jun 01 , 2025 | 03:41 AM
విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్‌ను ప్రభుత్వం బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. విపత్తుల నిర్వహణలో విఫలమై, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను తప్పించి ఆర్టీజీఎస్ సీఈవో ప్రభాకర్ జైన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆర్‌సీజీఎస్ సీఈవో ప్రభాకర్ జైన్‌కు అదనపు బాధ్యతలు
అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న రోణంకి కూర్మనాథ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సీఈవోగా ఉన్న ప్రభాకర్ జైన్‌కు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో విపత్తుల నిర్వహణలోనూ, ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆ విభాగం పూర్తిగా విఫలమైంది. ఆ మధ్య కాలంలో దాదాపు నెల రోజుల పాటు ప్రజలను అప్రమత్తం చేసే ఫోన్ మేసేజ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. పైగా విపత్తుల నిర్వహణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పరికరాల కొనుగోలులో అవినీతి ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా ఆ విభాగంలో జరుగుతున్న వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సమావేశాల్లో సీరియస్ అయ్యారు. దీంతో కూర్మనాథ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 03:41 AM