Mithun Reddy High Court: ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్.. ఎందుకంటే
ABN, Publish Date - Apr 17 , 2025 | 11:12 AM
Mithun Reddy High Court: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. మద్యం కుంభకోణంలో విచారణకు రావాల్సిందిగా ఏపీ సిట్ జారీ చేసిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ.
అమరావతి, ఏప్రిల్ 17: వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం వ్యవహారంలో ఏపీ సిట్ (AP SIT) జారీ చేసిన నోటీసులపై ఎంపీ మిథున్ రెడ్డి (YSRCP MP Mithun Reddy) హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. మద్యం కుంభకోణంలో రేపు (శుక్రవారం) విచారణకు రావాల్సిందిగా మిథున్ రెడ్డికి ఏపీ సిట్ నోటీసులు ఇచ్చింది. విచారణ సందర్భంగా న్యాయవాదిని అనుమతించాలని, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంలో రేపు ఉదయం 11 గంటలకు మిథున్ రెడ్డి సిట్ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది.
మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాల్సిందిగా మిథున్ రెడ్డికి ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం విజయవాడలోని సీపీ కార్యాలయంలోని ఏపీ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర సమాచారం తమకు అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఎంపీ పిటిషన్ వేశారు. అంతుకు ముందు కూడా ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆపై ఎంపీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలని ఎంపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరుకావాలని ఏపీ సిట్ నోటీసులు జారీ చేయగా... ఆయన ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఎలాంటి రక్షణ కల్పిస్తుందో వేచి చూడాలి.
నేడు సిట్ ముందుకు సాయిరెడ్డి
మరోవైపు ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సిట్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో కలిపి విచారించాలని భావించిన సిట్.. రేపు (ఏప్రిల్ 18)న విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని.. ఒక రోజు ముందుగా అంటే ఈరోజు (ఏప్రిల్ 17) విచారణకు వస్తానని సిట్‌కు సాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. ఇందుకు సిట్ కూడా ఓకే చెప్పేసింది. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ కసిరెడే అంటూ ఇటీవల మీడియా ముందే విజయసాయిరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. తనకు తెలిసిన వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సాయిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో సిట్ విచారణలో విజయసాయిరెడ్డి ఏ విషయాలను బయటపెట్టనున్నారు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి
Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్
Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 17 , 2025 | 04:35 PM