WhatsApp governance.. ఏపీలో ‘వాట్సాప్ పాలన’ ప్రారంభించిన మంత్రి లోకేష్..
ABN, Publish Date - Jan 30 , 2025 | 01:06 PM
కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. వాట్సాప్ గవర్నెన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీలో గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇది గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. దీనిద్వారా మొదటి విడతగా 161 సేవలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
అమరావతి: దేశంలోనే మొదటి సారిగా ఏపీ (AP)లో వాట్సాప్ (WhatsApp) పాలన చేయనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp governance ) సేవలను ఐటీ, విద్యశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) గురువారం ప్రారంభించారు (Launched). తొలిదశలో ప్రజలకు 161 సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం ప్రభుత్వం మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ పాలన తీసుకువస్తున్నామని, ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి సేవలు లేవని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌తో సులభంగా సమస్యల పరిష్కారం చేసుకోవచ్చుని, యువగళం పాదయాత్రలోనే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
ఈ వార్త కూడా చదవండి..
జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
నకిలీకి ఆస్కారం ఉండదు..
తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల చేతుల్లో పాలన ఉండాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి లోకేష్ అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రభుత్వ సేవలకు విస్తరిస్తామని, మొత్తం 360 సేవల్లో వాట్సాప్ గవర్నెన్స్ పాలన జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రతి సర్టిఫికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుందని.. తద్వారా వాట్సాప్ గవర్నెన్స్‌తో ఎక్కడా నకిలీకి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. తాను యువగళం పాదయాత్ర చేసినప్పుడు అన్ని వర్గాలను కలిశానని, గత ఐదేళ్లలో (జగన్ పాలనలో) జరిగిన విధ్వంసాన్ని కళ్లారా చూశానని లోకేష్ అన్నారు.
చంద్రబాబు 2.0 పనితీరుకు ఇది మరో మైలురాయి..
ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు ఎందుకు తీసుకెళ్లలేము అని.. యువగళంలో వచ్చిన సవాల్ ఫలితమే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అని మంత్రి లోకేష్ తెలిపారు. చంద్రబాబు 2.0 పనితీరుకు ఇది మరో మైలురాయి అని అన్నారు. యువగళం పాదయాత్రలో సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగలేకపోతున్నామనే ఫిర్యాదులు వచ్చాయని, ప్రభుత్వ సేవల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లటం ఓ సవాల్‌గా తీసుకుని ఇప్పటి వరకూ ఎవరూ చేయని విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. దుగ్గిరాలలో ఎంపీటీసీగా పోటీచేసిన ఓ ముస్లిం మహిళకు ప్రభుత్వం సర్టిఫికేట్ ఇవ్వని ఘటన కూడా గత ప్రభుత్వంలో చూశామని, ఈ సవాళ్లు అన్నింటికీ పరిష్కార ఫలితమే ఈ మన మిత్ర పథకం అని మంత్రి లోకేష్ తెలిపారు. మన మిత్ర పేరుతో వాట్సాప్ సేవల్ని అందిస్తున్నామని, రెండో విడతలో టీటీడీ దర్శనం టిక్కెట్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ నూతన విధానాన్ని మేం కూడా నేర్చుకునే దశలోనే ఉన్నామని అన్నారు. ఎక్కడైనా ట్రాన్సక్షన్ ఆగిపోతే ప్రభుత్వమే వినియోగదారుడికి ఫోన్ చేసి పరీష్కరించే విధానం తెస్తున్నామన్నారు. మున్ముందు మరింత మెరుగ్గా మన మిత్ర అమలు చేస్తామని, వచ్చే 6 నెలల్లో గణనీయ మార్పులు ప్రజలే చూస్తారని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
మెటా ఉపాధ్యక్షురాలు సంధ్య కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ప్రజాసేవలు అందించటం తమకు గర్వంగా ఉందని మెటా సంస్థ ఉపాధ్యక్షురాలు సంధ్య అన్నారు. వాట్సాప్ ఇప్పుడు ఎక్కువ మంది వాడుతున్నందున పీపుల్ ఫ్రెండ్లీగా దీనిని రూపొందించామని, వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించే విధానంపై చాలా కృషి చేశామని సంధ్య వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో ‘వాట్సాప్ పాలన’ ప్రారంభించిన మంత్రి లోకేష్..
కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
వేములవాడలో బీభత్సం సృష్టించిన లారీ
జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 30 , 2025 | 01:22 PM