Jagan Case: జగన్ కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు
ABN, Publish Date - Jan 27 , 2025 | 11:37 AM
YS Jaganmohan: జగన్ కేసుల బదిలీకి నిరాకరించింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు పర్యవేక్షణ నేపథ్యంలో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేశారు. అలాగే జగన్ బెయిల్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని చెప్పింది.
న్యూఢిల్లీ, జనవరి 27: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు (supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసులను రోజు వారీ విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ కేసుల బదిలీకి నిరాకరించింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు పర్యవేక్షణ నేపథ్యంలో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేశారు. అలాగే జగన్ బెయిల్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని చెప్పింది.
గతంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. ట్రయల్ కోర్టు... రోజు వారీ విచారణకు తీసుకోవాలని, హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని అందువల్ల మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం తేల్చిచెప్పింది.
అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు తెలంగాణ సీబీఐ కోర్టులో జరుగుతున్న కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన రెండు పిటిషన్‌లపై ఈరోజు (సోమవారం) సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. జగన్ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని ధర్మాసనం చెప్పడంతో రఘురామ తరపు న్యాయవాది ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీనికి ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను ప్రత్యేక కోర్టులు రోజు వారీగా చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని కోర్టుకు జగన్ న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్పారు.
అయినా... జగన్ అక్రమాస్తుల కేసుల ట్రయల్ మాత్రం జరగడం లేదని రఘురామ కృష్ణ రాజు న్యాయవాది వాదించారు. కేవలం శుక్రవారం, శనివారం మాత్రమే తీసుకున్నారని తెలిపారు. గత 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా పరిష్కారానికి నోచుకోలేదని రఘురామ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులు వేగంగా ట్రయల్ సాగడం లేదని బదిలీ కోరడం జరిగిందన్నారు. పదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పాటు అయ్యిందని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని.. డిశ్చార్జ్ పిటిషన్‌ల విషయంలో ఆర్డర్ రిజర్వ్ చేసిన తర్వాత కూడా తీర్పు రాకుండానే జడ్జీలు ఆరు సార్లు బదిలీ అయ్యారని రఘురామ న్యాయవాది తెలిపారు. హైకోర్టు కూడా పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సి అవసరం లేదని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. త్వరగతిన ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సి అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
ట్రంప్ సంచలన నిర్ణయం.. ఈ దేశాలకు సహాయం బంద్
సాయంత్రం 4 గంటలకు ఎండీకి సమ్మె నోటీసు..
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 27 , 2025 | 02:07 PM