Share News

Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఈ దేశాలకు సహాయం బంద్

ABN , Publish Date - Jan 27 , 2025 | 10:20 AM

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోని అన్ని దేశాలకు సహాయం చేయడం నిలిపివేశారని తెలుస్తోంది. ఈ చర్య ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఈ దేశాలకు సహాయం బంద్
donald Trump

ఈ వారం డొనాల్డ్ ట్రంప్ (donald Trump) అమెరికా (america) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక, ప్రపంచంలోని అన్ని దేశాలకు సహాయం అందించడంపై ఆయన కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతదేశంలో కూడా ఈ నిర్ణయం చర్చలకు దారితీసింది. ప్రస్తుతానికి అమెరికా ప్రభుత్వము విదేశీ సహాయం విధానాలను సమీక్షిస్తుంది. తద్వారా భారతదేశంలో నిర్వహించే కొన్ని నిధులపై ప్రభావం పడే అవకాశముంది.


భారతదేశంలో ఈ ప్రాజెక్టులపై ప్రభావం..

ఈ సమీక్ష అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ద్వారా ప్రారంభించబడింది. గత శుక్రవారం అమెరికా మిషన్ భారతదేశంలో USAID తదితర సంస్థలతో సహకరిస్తున్న వివిధ ప్రాజెక్టులపై సమీక్ష చేసినట్లు సమాచారం అందింది. ఆ క్రమంలో USAID ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, ఆరోగ్యం, వ్యవసాయం, ఆహార భద్రతతో సంబంధం ఉన్న వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. తాజా నిర్ణయం ఈ కార్యక్రమాలకు వాయిదా వేయడానికి లేదా సమీక్షించడానికి కారణమయ్యే అవకాశం ఉంది.


ప్రభావిత రంగాలు..

USAID భారతదేశంలో ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ప్రముఖంగా పని చేస్తుంది. శిశు మరణాలు, ప్రసూతి మరణాల్ని తగ్గించేందుకు, క్షయవ్యాధి, AIDS వంటి జఋల్ వ్యాధులను నియంత్రించేందుకు నిధులు అందిస్తుంది. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉన్న క్షయవ్యాధి కేసులు, ఆవిష్కరణలను ప్రోత్సహించే USAID పద్ధతుల ద్వారా అధిగమించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అదే సమయంలో వ్యవసాయం రంగంలో USAID భాగస్వామ్యంతో చేసిన పలు ఆవిష్కరణలు, సౌర-ఆధారిత డీహైడ్రేటర్ వంటి టెక్నాలజీలను విస్తరించడంలో మద్దతు ఇచ్చింది. ఇవి ఆహార భద్రత, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి.


బంగ్లాదేశ్‌కు సంబంధించిన కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంగ్లాదేశ్‌కు ఇచ్చే అన్ని రకాల సహాయాన్ని నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశించారు. ఇది బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అమెరికా ప్రాజెక్టులపై తక్షణ ప్రభావం చూపింది. అమెరికా విదేశీ సహాయ సంస్థ USAID, బంగ్లాదేశ్‌లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, విపత్తు సహాయం వంటి రంగాల్లోని అన్ని ప్రాజెక్టులను నిలిపివేయాలని ప్రకటించింది. అందులో బంగ్లాదేశ్‌కి ఇచ్చే సహాయం ముఖ్యంగా గ్రాంట్లు, కాంట్రాక్టులు, ఇతర మానవతా సహాయం సంబంధిత కార్యక్రమాలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌లో గణనీయమైన ఆర్థిక దెబ్బను వ్వచ్చే అవకాశం ఉంది.


మానవ హక్కుల ఉల్లంఘనల కారణంగా నిర్ణయం

అందరికీ తెలిసినట్లుగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ఆయన ఈ విషయాన్ని ట్రంప్ పరిపాలనతో చర్చించారు. బంగ్లాదేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్య వెనుక ప్రధాన కారణం మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రతిబింబించడమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


అంతర్జాతీయ ప్రభావం..

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అంగీకారంగానా లేక వ్యతిరేకంగానా అనే విధంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. బంగ్లాదేశ్ మీద అమెరికా తీసుకున్న ఈ చర్యపై ఆ దేశం నుంచి ఎటువంటి అధికారిక ప్రతిస్పందన లేదని సమాచారం అందింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్, భారతదేశం, అలాగే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలపై పెద్ద ప్రభావం చూపే అవకాశముంది. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా విదేశీ సహాయం కీలకంగా ఉంటే, ఈ రకమైన నిర్ణయాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు. 2022 ఆర్థిక సంవత్సరంలో అమెరికా విదేశీ సహాయం దాదాపు $70 బిలియన్ల విలువ కలిగిన ఒప్పందాలను ప్రభావితం చేయవచ్చు.


ఇవి కూడా చదవండి:

UNICEF: 2025లో ప్రమాదంలో 47 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు.. సేవ్ చేయలేమా..


Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..

Read More International News and Latest Telugu News

Updated Date - Jan 27 , 2025 | 10:21 AM