ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Raj Kasireddy: ఏపీ లిక్కర్ స్కాం.. రాజ్ కేసిరెడ్డికి ఎదురుదెబ్బ

ABN, Publish Date - May 01 , 2025 | 04:35 PM

Raj Kasireddy CID Custody: లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజ్‌ కేసిరెడ్డి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్ కేసిరెడ్డిని ప్రశ్నించేందుకు సీఐడీకి కోర్టు అనుమతిచ్చింది.

Raj Kasireddy CID Custody

విజయవాడ, మే 1: ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డికి (Raj Kasereddy) బిగ్ షాక్ తగిలింది. రాజ్ కేసిరెడ్డిని సీఐడీ కస్టడీకి (CID Custody) అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి (శుక్రవారం) నుంచి ఏడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు రాజ్ కేసిరెడ్డి విచారణకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఈ విచారణ ద్వారా రాజ్ కేసిరెడ్డి వెనుక ఉన్న సూత్రధారుల వివరాలను రాబట్టాలని సీఐడీ అధికారులు చూస్తున్నారు.


కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కేసిరెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కేసిరెడ్డికి అనేక మార్లు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా విచారణకు హాజరుకాకుండా కేసిరెడ్డి డుమ్మా కొడుతూ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి విజయవాడకు తీసుకువచ్చి రాత్రంతా కూడా సిట్ అధికారులు విచారణ జరిపారు. ఆపై తెల్లారి కూడా మరోసారి కేసిరెడ్డిని విచారించారు సిట్ అధికారులు. ఈ సందర్భంగా పలు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.


ఈ కేసులో సిట్ సేకరించిన పలు ఆధారాలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో చెప్పిన సమాచారంతో సిట్ అధికారులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే తొలుత అధికారులకు కేసిరెడ్డి సహకరించలేదని తెలుస్తోంది. రెండో విడత విచారణలో కొన్ని ఆధారాలతో సిట్ అధికారులు ప్రశ్నించగా.. కొన్నింటికి సమాధానాలు చెప్పగా.. మరికొన్నింటికి తనకు సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. సిట్ విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కేసిరెడ్డి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కేసిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. మరోవైపు ఈకేసులో ముందస్తు బెయిల్‌ కోసం రాజ్ కేసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. కేసిరెడ్డి పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

Chandrababu MSME Parks: రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తాం.. పరిశ్రమలు పెట్టండి


Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2025 | 04:55 PM