ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Babu Fan: ఇదెక్కడి అభిమానంరా బాబు.. ఏకంగా పాముతోనే థియేటర్లోకి ఎంట్రీ

ABN, Publish Date - May 30 , 2025 | 12:40 PM

Mahesh Babu Fan: సినిమాలో హీరో చేసే కొన్ని కొన్ని సీన్లను నిజజీవితంలో కూడా కొంతమంది అనుకరిస్తూ ఉంటారు. వారి స్టైల్స్ , డ్రెసింగ్, డైలాగ్స్ ఇలా తమకు నచ్చిన విధంగా ఫాలో అవుతుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అభిమాని మాత్రం మహేష్ ఎంట్రీ సీన్‌ను అనుకరించి తోటి అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు.

Mahesh Babu Fan Overaction

విజయవాడ, మే 30: చాలా మంది ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను గౌరవిస్తారు. ఆరాధిస్తుంటారు. హీరోను ఒక్కసారైనా చూడాలని వెంపర్లాడుతుంటారు. ఇక హీరో పుట్టిన రోజు వస్తే అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. అంతే కాకుండా తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పుకోవాలి. థియేటర్ల వద్ద వారి హడావుడి అంతా ఇంతా కాదు. థియేటర్లలో హీరో ఎంట్రీని చూసి విజిల్స్‌ వేస్తూ సందడి చేస్తుంటారు ఫ్యాన్స్ . ఈ మధ్య కాలంలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అప్పట్లో సూపర్ హిట్ అయిన హీరోల మూవీలను మరోసారి థియేటర్లలో చూసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో తమ అభిమాన హీరో నటించి హిట్ అయిన సినిమాలను థియేటర్లలో రావడంతో ఫ్యాన్స్‌ కూడా సినిమా హాల్స్‌‌కు క్యూకడుతున్నారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) నటించిన ఖలేజా మూవీని (Khaleja Movie) రీరిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని చేసిన అత్యుత్సాహం వైరల్‌గా మారింది. ఇంతకీ సదరు ఫ్యాన్ ఏం చేశాడు.. ఎలాంటి విన్యాసాలకు పాల్పడ్డాడో ఇప్పుడు చూద్దాం.


సాధారణంగా సినిమాలో హీరో చేసే కొన్ని కొన్ని సీన్లను నిజజీవితంలో కూడా కొంతమంది అనుకరిస్తూ ఉంటారు. వారి స్టైల్స్ , డ్రెసింగ్, డైలాగ్స్ ఇలా తమకు నచ్చిన విధంగా ఫాలో అవుతుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అభిమాని మాత్రం మహేష్ ఎంట్రీ సీన్‌ను అనుకరించి తోటి అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. మహేష్ అభిమాని ఓవరాక్షన్‌తో కొంత సమయం పాటు ఫ్యాన్స్ భయాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


విజయవాడ‌లోని ఓ థియేటర్‌లో మహేష్ నటించిన ఖలేజా మూవీని రీరిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఖలేజా మూవీలో మహేష్ ఎంట్రీ సీన్‌లో పాముతో నడివచ్చే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ చూసి అభిమానులు ఈలలు వేస్తూ సందడి చేశారు. అయితే ఓ అభిమాని మాత్రం మహేష్ ఎంట్రీ సీన్‌ను యదావిధిగా అనుకరించాడు. ఏకంగా నిజమైన పాము పిల్లతో థియేటర్లోకి వచ్చాడు ఆ ఫ్యాన్. మొదట అది రబ్బర్ పాము అని మిగిలిన ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. కానీ పాము కదులుతూ ఉండటంతో అది నిజమైన పాము అని గ్రహించి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే థియేటర్ యజమానికి ఈ విషయాన్ని చెప్పారు. థియేటర్ యజమాని అక్కడకు చేరుకుని సిబ్బందితో కలిసి పాముతో వచ్చిన అభిమానిని బయటకు పంపించేశారు. ఈ ఘటనతో కాసేపు థియేటర్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అభిమానం ఉండాలి కానీ మరీ ఇంతలానా అంటూ కొందరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

మాజీ సీఎం జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన భాను ప్రకాష్

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 30 , 2025 | 12:54 PM