ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Responds Human Trafficking: నా కుమారులను రక్షించండి.. మహిళ వినతి.. స్పందించిన పవన్

ABN, Publish Date - Jul 10 , 2025 | 03:03 PM

Pawan Respond Human Trafficking: ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలని పవన్‌ను గండబోయిన సూర్యకుమారి అనే మహిళ కోరారు. మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు.

Deputy CM Pawan Kalyan

అమరావతి, జులై 10: ఎవ్వరు ఎలాంటి ఆపదలో ఉన్నా, తమకు సహాయం చేయండి అని అర్ధిస్తే చాలు వెంటనే స్పందిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan). ఇటీవల తీవ్ర కష్టాల్లో ఉన్న నటి పాకీజాకు డిప్యూటీ సీఎం ఆర్థిక సాయం అందించారు. ఇలా ఎంతో మందికి.. అనేక విధాలుగా సహాయం అందించారు ఉపముఖ్యమంత్రి. ఇప్పుడు తాజాగా ఓ మహిళ కష్టం చూసి చలించిపోయారు. ఆ మహిళ సమస్య విన్న వెంటనే తక్షణమే స్పందించారు డిప్యూటీ సీఎం.

మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఓ మహిళ వినతి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం.. ఈ సమస్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలని పవన్‌ను విజయనగరానికి చెందిన గండబోయిన సూర్యకుమారి అనే మహిళ కోరారు. మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వారిని విడిపించేందుకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తమ ఇద్దరు కుమారులతో పాటు 8 మంది మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్నట్లు డిప్యూటీ సీఎంకు మహిళ చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్.. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరారు. ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది. విదేశాల్లో మగ్గుతున్న వారిని వెనక్కి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్‌కు విదేశీ వ్యవహారాల శాఖ హామీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

స్కూళ్లలో నో పాలిటిక్స్.. అంతా బయటే: మంత్రి లోకేష్

మెగా పీటీఎం.. స్టూడెంట్స్‌కు పాఠం చెప్పిన సీఎం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2025 | 03:42 PM