ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Viral Tweet: ప్రధాని మోదీపై పవన్ సంచలన ట్వీట్

ABN, Publish Date - May 08 , 2025 | 11:55 AM

Pawan Viral Tweet: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి డిప్యూటీ సీఎం పవన్ మరో పేరు పెట్టారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Pawan Viral Tweet

అమరావతి, మే 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (PM Narendra Modi) ఉద్దేశిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఓ సంచలన ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని అనికేత్‌ అని అభివర్ణించారు. అనికేత్ ఒక పేరు, ఒక సంకల్పమని తెలిపారు. తన సన్యాసి జీవితంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనికేత్ అని పిలిచేవారని పవన్ అన్నారు. అనికేత్ అంటే ఇళ్లు లేకుండా అని అర్ధం అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రధాని గురించి పవన్ చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


పవన్ ట్వీట్ ఇదే..

‘అనికేత్’ - ఒక పేరు, ఒక సంకల్పం. తన సన్యాసి జీవితంలో, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీని 'అనికేత్' అని పిలిచేవారు. అంటే 'ఇల్లు లేకుండా' అని అర్థం.'అనికేత్' అనేది సృష్టికి శాశ్వత సన్యాసి అయిన శివుడికి కూడా ఒక పేరు. విశ్వంలోని ప్రతి కణం ఒక ఇల్లు, అయినప్పటికీ అతనికి స్వంత ఇల్లు లేదు. నేడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుంచి ద్వారక వరకు మొత్తం భారతదేశాన్ని తనదిగా భావించిన అదే 'అనికేత్'. తాను నిరాశ్రయుడైనా 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన' కింద కోట్లాది మందికి ఇళ్లను అప్పగించాడు’ అంటూ ఎక్స్‌ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.


కాగా.. ఇటీవల జరిగిన అమరావతి పున:నిర్మాణ పనుల కార్యక్రమంలో మోదీ మరో పేరును పవన్ రివీల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ తన ప్రసంగంలో మోదీని అనికేత్ అని పిలిచేవారని అన్నారు. సాధారణంగా మోదీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనేది అందరికీ తెలిసిందే. కానీ మోదీకి మరో పేరు ఉందని.. అదే అనికేత్‌ అని సభా వేదికగా వెల్లడించారు. ప్రధాని గతంలో సన్యాస దీక్షలో ఉన్నప్పుడు మోదీకి అనికేత్ అని పెట్టారని తెలిపారు. అనికేత్ అంటే పరమ శివుడు, ఇల్లు లేని వాడు అని అర్ధమని పవన్ చెప్పారు. అలాంటి ఇల్లు, కుటుంబం లేని మోదీ.. 5 కోట్ల ఆంధ్రులకు ఇల్లులాంటి రాజధాని నగరం నిర్మించడానికి వచ్చారని చెప్పుకొచ్చారు. అయితే పవన్ ఎప్పుడైతే తన నోటి నుంచి అనికేత్ అనే పేరును బయటపెట్టారో మోదీ కూడా ఒకింత షాక్‌కు గురైనట్లు కనిపించారు. ఆ తరువాత ఆ పేరును పిలిచిన పవన్ వైపు చూస్తూ చిరునవ్వు చిందించారు ప్రధాని.


ఇవి కూడా చదవండి

AP Liquor Scam Supreme Court: ఏపీ లిక్కర్ స్కాం.. ఆ ముగ్గురికి సుప్రీంలో ఎదురుదెబ్బ

Donald Trump: ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ స్పందన

Read latest AP News And Telugu News

Updated Date - May 08 , 2025 | 01:33 PM