ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu.. ఈ పథకాన్ని సమర్ధవంతంగా వాడుకోవాలి: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Feb 11 , 2025 | 11:54 AM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం వ్యవసాయం, ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు ప్రయత్నం చేయాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవటం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉందని అన్నారు.

CM Chandrababu Nayudu

అమరావతి: కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరితగతిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. మంగళవారం సచివాలయం (Secretariat)లో మంత్రులు (Ministers), కార్యదర్శులతో కాన్ఫరెన్స్ (Conference with secretaries) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయం, ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు ప్రయత్నం చేయాలని, ఉద్యాన రంగంతో పాటు వ్యవసాయంలోనూ విలువ జోడిస్తే ఎక్కువ సంపద ఆర్జించేందుకు ఆస్కారం ఉంటుందని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పైనా దృష్టి పెట్టాల్సి ఉందని అన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

ఏపీ మంత్రుల నెత్తిన ర్యాంకుల పిడుగు


ప్రతీ ఇంటికీ సురక్షితమైన తాగు నీరు..

టెక్నాలజీని అందిపుచ్చుకోవటం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉందని, గత ఐదేళ్లలో (జగన్ పాలనలో) జల్ జీవన్ లాంటి కేంద్ర పథకాలను కూడా సరిగ్గా వినియోగించుకోలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రతీ ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని సమర్ధవంతంగా వాడుకోవాలన్నారు. కేంద్ర బడ్జెట్‌కు అనుకూలంగా మన బడ్జెట్‌ను సమన్వయం చేసుకోవాలని సూచించారు. 2047 స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రతీ ఏటా 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 2.4 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఏపీ అభివృద్ధి చెందాలని, గతంలో టీడీపీ చేసిన వివిధ విధానాలే ఇప్పుడు ఫలితాలను అందిస్తున్నాయన్నారు. ఇప్పుడు చేసిన 2047 కూడా మన భవిష్యత్ తరాలకు ఉపకరిస్తాయన్నారు.


2025-26 బడ్జెట్ వినూత్నం..

2025-26 బడ్జెట్ వినూత్నంగా ఉండాలని, ప్రజల ఆకాంక్షలు పూర్తి చేసేలా ప్రతీ విభాగం యోచన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కొన్ని విభాగాలు ఆదాయాన్ని, కొన్ని విభాగాలు జీఎస్డీపీకి, కొన్ని మానవవనరుల్ని, మరికొన్ని నిబంధనల అమల్లో కీలకంగా ఉన్నాయన్నారు. అన్నీ సమిష్టిగా పనిచేస్తేనే ఏపీ వృద్ధి రేటు సాధించగలుగుతామని, సీఎం నుంచి గ్రామ కార్యదర్శి వరకూ అంతా సమర్ధంగా పనిచేస్తేనే ఏపీ అగ్రస్థానానికి చేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు జాతిని ఉన్నతస్థాయిలో నిలపాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యంగా చంద్రబాబు పేర్కొన్నారు. తాను, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు సంయుక్తంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని అలోచిస్తున్నామని, అఖిలభారత సర్వీసు అధికారులు , ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేస్తేనే అధి సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.


24 నుంచి ఏపీ అసెంబ్లీ

కాగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్నాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. మరుసటి రోజు గవర్నర్‌ ప్రసంగంపై చర్చను చేపడతారు. ఈ సమావేశాలను సుమారు 20 పని దినాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే బీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధుల అర్థవంతమైన భాగస్వామ్యం ఉండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 22, 23న శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు, శిక్షణ తరగతులకు సమాయత్తంగా మంగళవారం చీఫ్‌ విప్‌, విప్‌లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, శాసనమండలి చైర్మన్‌, ఉభయసభలకు చెందిన ఇద్దరు చీఫ్‌ విప్‌లతోపాటు 18మంది విప్‌లు హాజరవుతారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..

కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే..

4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు

ఆ యాక్టు మార్చే ఆలోచన లేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 11 , 2025 | 11:55 AM