SIPB Meeting.. సిఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం
ABN, Publish Date - Jan 30 , 2025 | 12:45 PM
సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ 3వ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. తద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన గురువారం అమరావతి (Amaravati)లో స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ ( SIPB ) 3వ సమావేశం (Meeting) జరుగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా 15 ప్రాజెక్టులకు సంబందించి పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోనున్నారు. రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఈ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకావముంది. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైనా ఈ రోజు చర్చ జరుగుతోంది.
ఈ వార్త కూడా చదవండి..
కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చల ద్వారా సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సిఎం సిఎం చంద్రబాబు సూచించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్ధాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తి కరంగా ఉందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు.
వాట్సాప్ పాలన
కాగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. వాట్సాప్ గవర్నెన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీలో గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి రానుంది. దీనిద్వారా మొదటి విడతగా 161 సేవలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి, పౌరులకు అవసరమైన సమాచారం అందించడం, ధ్రువపత్రాల జారీ లాంటి పలు సేవలు ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
మెటాతో ఒప్పందం..
వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు గతేడాది అక్బోబర్ 22న మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తొలి విడతగా పౌరులకు 161 సేవలను కూటమి ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు సచివాలయంలో సమీక్షలో ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను ఏ విధంగా పొందవచ్చో దానిపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొదటి విడతలో ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, దేవాదాయ, ఎనర్జీ, సీఎంఆర్ఎఫ్, అన్నక్యాంటీన్, మున్సిపల్ వంటి పలు శాఖల్లో సుమారు 161 సేవలను పౌరులకు అందుబాటులోకి తెచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వేములవాడలో బీభత్సం సృష్టించిన లారీ
జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
మాఘమాసం వచ్చేసింది... శుభ ఘడియలు.. పెళ్లి సందడి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 30 , 2025 | 12:45 PM