ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhuvaneshvari: ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మ్యూజిక్ నైట్

ABN, Publish Date - Jan 24 , 2025 | 05:14 PM

Bhuvaneshvari: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న నిర్వహించనున్న మ్యూజిక్ నైట్ గురించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కీలక విషయాలు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజ సేవ కోసం చాలా గొప్ప ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఒక వైపు వినోదం, మరో వైపు దాతృత్వం – మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు భువనేశ్వరి పేర్కొన్నారు.

Bhuvaneshvari

విజయవాడ: ఎన్టీఆర్‌ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రిబవరి 15వ తేదీన ఇప్టోరియా మ్యూజిక్ నైట్ నిర్వహిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్ పాల్గొంటారని అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని ఇవాళ(శుక్రవారం) భువనేశ్వరి పరిశీలించారు. NTR ట్రస్ట్ ఏర్పాటు చేసే ఈ ఈవెంట్‌కు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి15న జరగబోయే ఈ కార్యక్రమంపై చర్చించారు. పాస్‌లు ఉంటేనే లోపలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఈ మ్యూజికల్ నైట్‌ను వీక్షించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అందరూ రావాలని నారా భువనేశ్వరి కోరారు.


మీరు కొనే టిక్కెట్ డబ్బుతో తలసేమియాతో బాధపడే వారికి సహకారం అందిస్తామని అన్నారు. సోషల్ కాజ్‌తో ఐదు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు రూ. 60 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. తలసేమియాతో బాధపడే వారికి మందులు, రక్తం వంటి వాటికి చాలా ఖర్చు అవుతుందన్నారు. ఉచితంగా బ్లడ్, మందులు ఇప్పటికే అందజేస్తున్నామని చెప్పారు. ఇది ఒక మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమమని.. అందరూ తమ ఆపన్నహస్తం అందిస్తారని ఆశీస్తున్నానని భువనేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - Jan 24 , 2025 | 10:09 PM