ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kasireddy SIT Custody: తొలిరోజు అలా... రెండో రోజు కసిరెడ్డి ఏం చెప్పబోతున్నారో

ABN, Publish Date - May 03 , 2025 | 11:18 AM

Kasireddy SIT Custody: లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కసిరెడ్డిని సిట్ ఆఫీసర్లు ప్రశ్నించనున్నారు.

Raj Kasireddy SIT Custody

విజయవాడ, మే 3: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam Case) ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని (Raj Kasireddy) రెండో రోజు సిట్ అధికారులు కస్టడీలోకి (SIT Custody) తీసుకున్నారు. ఈరోజు (శనివారం) ఉదయం విజయవాడ జిల్లా జైలులో ఉన్న రాజ్ కసిరెడ్డిని ముందుగా ప్రభుత్వాస్పత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. కసిరెడ్డిని వారం రోజుల పాటు‌ విచారణకు కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. నిన్న తొలిరోజు రాజ్‌ను కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు మద్యం కుంభకోణానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. అయితే వీటిలో చాలా వాటికి రాజ్ సమాధానాలు చెప్పనట్లు తెలుస్తోంది.


గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ ఏర్పాటు నుంచి కసిరెడ్డి పాత్ర ఉన్నట్లు సిట్ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో మొత్తం మూడేళ్ల పాటు ఈ వ్యవహారం నడిచినట్లు గుర్తించిన సిట్... ఈ స్కాంలో ఎవరెవరి పాత్ర ఎంత వరకు ఉంది.. ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు అనే ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అలాగే దేశ వ్యాప్తంగా అమలవుతున్న డిమాండ్ ఉన్న బిస్ట్లరీ కంపెనీలను ఏపీ వరకు మూయించేసి.. కొత్త వారికి అనుమతివ్వడం.. వారి ద్వారా మద్యం తయారు చేయించి.. నెలవారీగా ముడుపులు తదిర వ్యవహారం అంతా కసిరెడ్డి ఆధ్వర్యంలోనే నడిచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు... నెలవారీ మామూళ్లు ఏయే రూపంలో ఎంతమందికి పంపించారు అనే అంశాలపై కొన్ని ఆధారాలు సేకరించింది సిట్.


ఆ ఆధారాలు కసిరెడ్డి ముందు ఉంచి ప్రశ్నించినప్పటికీ తనకు తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీని అమలు చేసే బాధ్యతను మాత్రమే తీసుకున్నట్లు చెప్పారు. అయితే మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన సిట్..తెరవెనక అసలు సూత్రధారలు ఎవరు అనేదానిపై నోరు మెదపనట్లు తెలుస్తోంది. ఇప్పుడు రెండో రోజు అతడిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. లిక్కర్‌ స్కాంకు సంబంధించి ఈరోజు మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. మరి ఈరోజు రాజ్ కసిరెడ్డి ఎంతమేరకు సమాధానం చెబుతారో చూడాలి మరి.


ఇదిలా ఉండగా.. మూడు రోజుల క్రితం రాజ్ కసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దిలీప్‌ను కసిరెడ్డి ఎదురుగా ఉంచి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల కస్టడీ పూర్తి అయితే కానీ కసిరెడ్డి నుంచి మద్యం కుంభకోణానికి సంబంధించి ఎంత మేరకు సమాచారం రాబట్టారు అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

Toppudurthi Issue: తోపుదుర్తిని తప్పిస్తున్నారా.. బయటపడ్డ పోలీసుల వైఫల్యం

Nara Lokesh: అమరావతి అన్‌స్టాపబుల్‌

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2025 | 11:51 AM