ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Raj Kasireddy Interrogation: సుదీర్ఘ విచారణ.. కసిరెడ్డి నిజాలు ఒప్పుకున్నట్టా.. లేనట్టా

ABN, Publish Date - Apr 22 , 2025 | 04:29 PM

Raj Kasireddy Interrogation: లిక్కర్‌ స్కాం‌లో రాజ్ కసిరెడ్డిని దాదాపు 12 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. విచారణలో పలు కీలక విషయాలను సిట్ అధికారులు రాబట్టినట్లు సమాచారం.

Raj Kasireddy Interrogation

విజయవాడ, ఏప్రిల్ 22: ఏపీ లిక్కర్‌ స్కాంలో (AP Liquor Scam) ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డి (Raj Kasireddy) విచారణ ముగిసింది. సిట్ కార్యాలయంలో దాదాపు 12 గంటల పాటు విచారణ సాగింది. ఈ కేసుకు సంబంధించి సిట్ సేకరించిన ఆధారాలను చూపించి రాజ్ కసరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. కొన్ని అంశాలు తనకు తెలియదని, సంబంధం లేదని కసిరెడ్డి చెప్పినట్లు సమాచారం. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి నుంచి సిట్ బృందం కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం రాజ్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కసిరెడ్డిని విజయవాడ కోర్టులో సిట్ అధికారులు హాజరుపర్చనున్నారు.


గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి కీలక సూత్రధారిగా సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు రాజ్‌కు నోటీసులు ఇచ్చినప్పటికీ డుమ్మాకొట్టేశారు. సిట్ అధికారులకు సహకరించకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో అతడిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో నిన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కసిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. రాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి వివిధ రూపాల్లో రాజ్‌ను విచారించారు. విచారణలో భాగంగా సాంకేతికపరమైన అంశాలతో పాటు మద్యం లావాదేవీలపై కూడా, డిస్ల్టరీ కంపెనీలకు అనుమతులు ఏ విధంగా ఇచ్చారు అనే దానిపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల..


ఇప్పటికే ఈ కేసులో పలువురి వద్ద నుంచి సేకరించిన స్టేట్‌మెంట్లను కసిరెడ్డి ముందు ఉంచి విచారించారు సిట్ అధికారులు. కొన్ని మంతనాలు చేసినట్టు కసిరెడ్డి ఒప్పుకున్నప్పటికీ మరికొన్నింటిలో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మరికొంత మంది నుంచి సేకరించిన స్టేట్‌మెంట్ల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు సంధించినప్పటికీ కసిరెడ్డి తనకు తెలియదు అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో మరోసారి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో విడతగా విచారణ జరిపారు. పదే పదే అనేక అంశాలు ప్రస్తావించినప్పటికీ కూడా కసిరెడ్డి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వనట్లు తెలుస్తోంది.


ఇక నిన్న సాయంత్రం 6 గంటల ముందే ఆయనను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది . దీంతో విచారణను ముగించి కసిరెడ్డి నేరుగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నేరుగా విజయవాడ కోర్టులో హాజరుపర్చనున్నారు. కసిరెడ్డికి న్యాయమూర్తి రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

Operation Karreguttalu: కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది

JD Vance Jaipur Tour: అంబర్‌ కోటను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 22 , 2025 | 05:40 PM