ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Alcohol Scam: ఏపీ లిక్కర్‌ స్కాంలో ఆ ముగ్గురు

ABN, Publish Date - May 06 , 2025 | 03:11 PM

AP Alcohol Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురు పేర్లను చేర్చుతూ సిట్ అధికారులు మెమో వేశారు.

AP Alcohol Scam

అమరావతి, మే 6: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam Case) సిట్ అధికారులు (SIT Officers) మెమో వేశారు. లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను చేర్చారు సిట్ అధికారులు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో పేర్కొన్నారు నిందితులు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వీళ్ల పేర్లు చేర్చినట్లు మెమోలో పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలోనే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని నిన్న (సోమవారం) సుప్రీం కోర్టుకు ఈ ముగ్గురు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే వీరికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టులోనే ఈ కేసును చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు గోవిందప్ప పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది రెండు రోజుల క్రితం కోరారు.

India-pakistan tensions: పాత బంకర్లను పునురుద్ధరిస్తున్న ఇండియన్ ఆర్మీ


అప్పటి వరకు కూడా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఈ ముగ్గురు హైకోర్టును అభ్యర్థించారు. కానీ హైకోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ముగ్గురు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా వీరికి నిరాశే ఎదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించడంతో పాటు ఈ కేసులో జోక్యం చేసుకుందు కూడా నిరాకరించింది సుప్రీం ధర్మాసనం. దీంతో ఈ ముగ్గురు పేర్లను ఈ కేసులో చేర్చుతూ సిట్ మెమో దాఖలు చేసింది. ఈ మెమోను కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. కోర్టు ఈ మెమోను పరిగణలోకి తీసుకుంటే ఈ ముగ్గురిని ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులుగా చేర్చినట్టు అవుతుంది.


ఇవి కూడా చదవండి

Somireddy Vs Sajjala: సజ్జల నోరెందుకు మూగబోయిందో

Jupally On Miss World Event: మిస్‌ వరల్డ్ పోటీలు ఇందుకోసమే అన్న మంత్రి


Read Latest AP News And Telugu News

Updated Date - May 06 , 2025 | 04:38 PM