Perni Nani: పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడ్డ కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం
ABN, Publish Date - Jun 13 , 2025 | 09:08 PM
రేషన్ బియ్యం దుర్వినియోగంపై బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో పేర్ని నాని సతీమణిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో దర్యాప్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై నాని చేసిన చేసిన వ్యాఖ్యల పట్ల కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పేర్ని నాని (Perni Nani), సతీమణిపై బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో నమోదైన రేషన్ బియ్యం దుర్వినియోగం కేసుకు సంబంధించి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసు అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించినట్లు కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం తెలిపింది. ఈ కేసు నేపథ్యంలో సివిల్ సప్లయ్స్ అధికారులు ప్రిలిమినరీ విచారణ నిర్వహించి, ఆ రిపోర్టును విజయవాడలోని VC & MD, Civil Supplies కు పంపించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా SI.. బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, సీఐ దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
10 వాతలు పెడతాం..
దర్యాప్తు అధికారి జయసుధను విచారించే సమయంలో అసభ్యకరంగా మాట్లాడడం లేదా ఆమెను అగౌరపరిచే విధంగా ప్రవర్తించడం కానీ ఏమి జరగలేదు. కానీ, పేర్ని నాని ఈ విషయాన్ని వక్రీకరించి, తనకు అనుకూలంగా మరలచుకునేలా చేశారని పోలీసు అధికారుల సంఘం పేర్కొంది. మచిలీపట్నం రూరల్ సీఐ గారిని.. నాని గాడు అని ఏకవచనంతో సంబోధించడం, ఒక వాతకు 10 వాతలు పెడతానని బెదిరించడం అనేది సరియైంది కాదని కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం స్పష్టం చేసింది.
మరింత విచారణ..
ఈ వ్యాఖ్యలు కృష్ణా జిల్లా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, అందుకే తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసు అధికారుల సంఘం చెప్పింది. అందువల్ల సమాజంలో పోలీసులపై నమ్మకం తగ్గుతుందని అభిప్రాయపడింది. పోలీసు అధికారుల సంఘం, ఈ ఘటనపై మరింత విచారణ జరిపి, బాధితుల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తామని ప్రకటించింది.
మధ్యవర్తుల సమక్షంలో
ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలోనే పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ పొందారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, మచిలీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ జయసుధకు నోటీస్ ఇచ్చి, దర్యాప్తునకు పిలిపించారు. వారి అడ్వకేట్, ఉమన్ ఎస్ఐ, మధ్యవర్తుల సమక్షంలో కేసుకు సంబంధించిన విషయాలను విచారించారు. ఈ విచారణలో వారి సందేహాలను నివృత్తి చేసుకొని, జయసుధ స్టేట్‌మెంట్‌ను మధ్యవర్తుల చేత వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేశారు.
ఇవి కూడా చదవండి
మరోసారి సిట్ ముందుకు ప్రణీత్ రావు
పుట్టే బిడ్డపై ప్రాణాలు పెట్టుకున్న తండ్రి.. కుమారుడి మృతితో
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 13 , 2025 | 09:16 PM