ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kolla Ajay Clarification: క్రషింగ్‌ వ్యాపారంతో నాకు సంబంధం లేదు

ABN, Publish Date - Apr 17 , 2025 | 03:38 AM

గుంటూరు క్రషింగ్‌ వ్యాపారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొల్ల అజయ్‌ స్పష్టం చేశారు. విజిలెన్స్‌ కేసుల రివిజన్‌లలోనూ తన పాత్ర లేదని వివరణ ఇచ్చారు.

విజిలెన్స్‌ కేసుల రివిజన్‌లో నా పాత్ర లేదు: కొల్ల అజయ్‌ వివరణ

అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): గుంటూరులోని క్రషింగ్‌ వ్యాపారాలతో తనకు సంబంధం లేదని, గుంటూరులోని క్రషింగ్‌ యూనిట్లను చేజిక్కించుకోవాలని ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదని కొల్ల అజయ్‌ వివరణ ఇచ్చారు. క్రషింగ్‌ యూనిట్లు తనకు కావాలని వ్యక్తిగతంగా ఎవరిపైనా ఒత్తిడి తీసుకురాలేదని, తన పేరిట కూడా మరెవరూ రాయబారాలు నడపలేదని వివరించారు. గనుల శాఖలో జరిగే విజిలెన్స్‌ కేసుల రివిజన్స్‌లో తనకు ప్రమేయం, పాత్ర ఉండవన్నారు. ‘మైనింగ్‌ డాన్‌ ’, ‘గుంటూరులోనూ అజయ్‌ దందా’ శీర్షికలతో ఈనెల 15, 16 తేదీల్లో ‘ఆంధ్రజ్యోతి’ వార్తలు ప్రచురించింది. వీటిపై కొల్ల అజయ్‌ స్పందించారు. ‘ఆంధ్రజ్యోతి’కి బుధవారం వివరణ పంపించారు. తనకు గుంటూరు జిల్లాలో ఏ క్రషర్‌ వ్యాపారంలోనూ భాగస్వామ్యం లేదని తెలిపారు. గుంటూరులో క్రషర్లు ఎక్కడున్నాయో కూడా తనకు తెలియదని, ఆ వ్యాపారంలో ఎలాంటి పాత్ర, భాగస్వామ్యం లేదని చెప్పారు. గనుల శాఖ చేస్తున్న రివిజన్‌లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తన వివరణలో పేర్కొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 03:39 AM