ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ontimitta: సింహ వాహనంపై కోదండరాముడు

ABN, Publish Date - Apr 09 , 2025 | 05:24 AM

కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనంపై దర్శనం. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు 11వ తేదీన రాగలరు

  • 11న పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం వటపత్రశాయిగా, రాత్రి సింహవాహనంపై కోదండరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. కాగా.. కోదండరామస్వామి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సమన్వయంతో కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం టీటీడీ పరిపాలన భవనంలో కడప జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, ఎస్పీ అశోక్‌కుమార్‌, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణోత్సవానికి 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని తెలిపారు.

Updated Date - Apr 09 , 2025 | 05:24 AM