KLU Success Story: సక్సెస్‌కు చిరునామా కేఎల్ యూనివర్సిటీ
ABN, Publish Date - May 04 , 2025 | 04:44 AM
కేఎల్ యూనివర్సిటీ 2025 విద్యా సంవత్సరంలో వందశాతం ప్లేస్‌మెంట్లు సాధించి విద్యారంగంలో మరో మైలురాయిని నమోదు చేసింది. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు, లోకేశ్ నేతృత్వం యువత ప్రతిభను వెలికితీస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు
వందశాతం ప్లేస్‌మెంట్స్.. విద్యార్థుల ప్రతిభకు నిదర్శనం
విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబు, లోకేశ్: మంత్రి కొల్లు రవీంద్ర
తాడేపల్లి(వడ్డేశ్వరం), మే 3(ఆంధ్రజ్యోతి): కేఎల్ యూనివర్సిటీ అంటే సక్సె్‌సకు చిరునామా అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 2025 విద్యా సంవత్సరంలో వంద శాతం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సాధించిన సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఆదివారం విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన అనంతరం మంత్రి ప్రసంగించారు. ఇక్కడ చదివిన ఆరు వేల మందికి ప్లేస్‌మెంట్‌లు అంటే చిన్న విషయం కాదన్నారు. చంద్రబాబు, లోకేశ్ విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. నూతన విద్యా విధానం ద్వారా లోకేశ్ యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్నారని చెప్పారు. స్కిల్ సెన్స్‌సను తయారు చేసేలా నూతన విధానాలు అవలంభిస్తున్నారన్నారు.
క్వాంటమ్ వ్యాలీతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. చంద్రబాబు పాలనను స్ఫూర్తిగా తీసుకున్నానని మోదీ స్వయంగా చెప్పారంటే అది మన ముఖ్యమంత్రి పని తీరుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రోవీసీ డాక్టర్ వెంకట్రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, ప్లేస్‌మెంట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎన్‌బీవీ ప్రసాద్, నైపుణ్యాభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్, అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు, డాక్టర్ సుమన్, డాక్టర్ కిశోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
Goa Temple Stampede: గోవాలోని శ్రీ లరాయ్ దేవీ దేవాలయం యాత్రలో తొక్కిసలాట.. 7 దుర్మరణం
Nara Lokesh: అమరావతి అన్‌స్టాపబుల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 04 , 2025 | 04:44 AM