ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Muttukur Police FIR: కాకాణి పై మరో కేసు

ABN, Publish Date - Jun 10 , 2025 | 04:04 AM

అక్రమ మైనింగ్‌ కేసులో జైలుకు వెళ్లిన మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై సోమవారం ముత్తుకూరు పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. పంటపాలెం సమీపంలో ప్రైవేటు టోల్‌గేట్‌...

  • టోల్‌గేట్‌ అక్రమ వసూళ్లపై గతంలోనే టీడీపీ ఫిర్యాదు

ముత్తుకూరు, నెల్లూరు (లీగల్‌), జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : అక్రమ మైనింగ్‌ కేసులో జైలుకు వెళ్లిన మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై సోమవారం ముత్తుకూరు పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. పంటపాలెం సమీపంలో ప్రైవేటు టోల్‌గేట్‌ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని గతంలో టీడీపీ నాయకులు ముత్తుకూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారించి పోలీసులు కేసు నమోదు చేశారు. కాకాణి అనుచరుడైన తూపిలి శ్రీధర్‌రెడ్డితోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిస్వామిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, ఎస్సీ, ఎస్టీ అక్రమ మైనింగ్‌, పేలుడు పదార్థాల నిషేధ చట్టం కేసులో రిమాండ్‌లో ఉన్న కాకాణి గోవర్ధన్‌ రెడ్డి రిమాండ్‌ను ఈ నెల 23 వరకు పొడిగిస్తూ నెల్లూరు ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు ఇంచార్జ్‌ న్యాయాధికారి సిరిపిరెడ్డి సుమ ఉత్తర్వు చేశారు. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను 11కు వాయిదా వేశారు.

Updated Date - Jun 10 , 2025 | 04:06 AM