ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: మా ఆఫీసులపై దాడి చేసినవారి మీద పోలీసులు కేసులు పెట్టడం లేదు

ABN, Publish Date - Jun 20 , 2025 | 06:20 AM

సాక్షి కార్యాలయాలపై దాడి ఘటనలో తాము ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బి.రాణిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది.

  • హైకోర్టును ఆశ్రయించిన జగతి పబ్లికేషన్స్‌ డైరెక్టర్‌.. పిటిషన్‌కు విచారణార్హత లేదన్న ఏజీ

అమరావతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): సాక్షి కార్యాలయాలపై దాడి ఘటనలో తాము ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బి.రాణిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. పోలీసులు కేసు నమోదు చేయకుంటే మేజిస్ట్రేట్‌ వద్ద ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని.. హైకోర్టులో పిటిషన్‌ వేయడానికి వీల్లేదన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ తమ కార్యాలయాలపై దాడులను నిరోధించడంలో అధికారులు విఫలమయ్యారని, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌.. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ప్రతివాదులను ఆదేశించారు. విచారణను జూలై 22కి వాయిదా వేశారు

Updated Date - Jun 20 , 2025 | 06:23 AM