Nellore: నిందితుడి పరామర్శకు జగన్ వెళ్తున్నారు
ABN, Publish Date - Jul 02 , 2025 | 06:15 AM
నెల్లూరు జైల్లో ఉన్న వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో తాత్కాలిక హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని...
ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోంది
అయినా.. అదనపు భద్రత కోరుతున్నారు
వైసీపీ నేతల పిటిషన్‌పై ప్రత్యేక న్యాయవాది
విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జైల్లో ఉన్న వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో తాత్కాలిక హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. నెల్లూరులోని సెయింట్ ఆన్స్ పాఠశాల ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారన్నారు. పోలీసులు ప్రతిపాదించిన స్థలం హెలికాప్టర్ దిగేందుకు అనువుగాలేదని తెలిపారు. పోలీసులు తగిన భద్రత కల్పించకపోవడంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. రోప్ పార్టీని ఏర్పాటు చేసేలా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) యతీంద్రదేవ్ వాదనలు వినిపిస్తూ.. జైలు వద్ద అధికారులు సూచించిన స్థలంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు పిటిషనర్లు సమ్మతి తెలిపారని, రోప్ పార్టీ కోసం అడగాల్సిన పనిలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తోందని వివరించారు. అయినప్పటికీ అదనపు భద్రత కల్పించాలని కోరుతున్నారన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 06:16 AM