Minister Gottipati: జగన్ జనం నిన్ను నమ్మరు
ABN, Publish Date - May 09 , 2025 | 05:37 AM
జగన్ విద్యుత్ ధరలు తగ్గించామని చెప్పినా ప్రజలు నమ్మడం లేదని మంత్రి గొట్టిపాటి తెలిపారు. వైసీపీ హయాంలో విద్యుత్ సంస్థలపై రూ.1.29 లక్షల కోట్ల రుణ భారం పెరిగిందన్నారు
విద్యుత్ సంస్థలపై1.29 లక్షల కోట్ల రుణ భారం: మంత్రి గొట్టిపాటి
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ‘విద్యుత్తు చార్జీల విషయంలో ప్రజలకు మేలు చేశానంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెబుతున్న మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరు. సెకీ నుంచి యూనిట్ విద్యుత్తు రూ.2.49కు కొనుగోలు చేశామని జగన్ చెబుతున్నా... వాస్తవ ధర యూనిట్ రూ.7.90 అని ప్రజలకు బాగా అర్థమైంది’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం తాడేపల్లిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సెకీ కంటే యూక్సిస్ ధరే తక్కువని ప్రజలు గ్రహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు సంస్థలపై ఏకంగా రూ.1,29,000 కోట్ల రుణ భారాన్ని వేశారు. విద్యుదుత్పత్తి సంస్థలలో ఉత్పత్తిని తగ్గించేసి కమీషన్ల కోసం పీక్ అవర్‌లో యూనిట్ విద్యుత్తును సగటున రూ.9.30 చొప్పున కొనుగోలు చేసి జనం సొమ్మును లూటీ చేశారు. అవినీతి పత్రికను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వంపై జగన్ విష ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
Updated Date - May 09 , 2025 | 05:37 AM