Vijayawada Court: పీఎస్ఆర్‌కు మధ్యంతర బెయిల్
ABN, Publish Date - Jun 12 , 2025 | 05:04 AM
ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎ్‌సఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. విజయవాడ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజులు బెయిల్...
విజయవాడ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎ్‌సఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. విజయవాడ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజులు బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయాసం, గుండెలో నొప్పికి మంగళవారం నుంచి పీఎ్‌సఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతకుముందు ఆయన మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టేసిన హైకోర్టు ఈ అంశాన్ని కింది కోర్టులో తేల్చుకోవాలని ఆదేశించింది. దీనితో ఆయన తరపున న్యాయవాది విష్ణువర్ధన్ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం వాదనల అనంతరం న్యాయాధికారి దేవిక తీర్పు వెలువరించారు. మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ.. ఈనెల 26వ తేదీ సాయంత్రం ఆరు గంటలలోపు జైలుకు చేరుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తులు చెరో రూ.లక్ష పూచికత్తు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు.
Updated Date - Jun 12 , 2025 | 05:06 AM