ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Pemmashani Chandrasekhar: గ్లోబల్‌ డిజిటల్‌ లీడర్‌గా భారత్‌

ABN, Publish Date - Jun 04 , 2025 | 05:10 AM

భారతదేశం డిజిటల్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా మారింది అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బ్రెజిల్‌లో జరిగిన 11వ బ్రిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రుల సమావేశంలో భారత్ 4జీ, 5జీ సేవల విస్తరణ వివరించారు.

  • బ్రిక్స్‌ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని

న్యూఢిల్లీ, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ రంగంలో భారత్‌ గ్లోబల్‌ లీడర్‌గా మారిందని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్స్‌ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. బ్రెజిల్‌లోని బ్రెసిలియాలో నిర్వహించిన 11వ బ్రిక్స్‌ కమ్యూనికేషన్స్‌ మంత్రుల సమావేశంలో పెమ్మసాని పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2.18 లక్షల గ్రామాలకు భారత్‌ నెట్‌ ద్వారా కనెక్టివిటీ కల్పించామని, 95 శాతానికిపైగా జనాభాకు 4జీ అందుబాటులో ఉందని, 80 శాతానికి పైగా జనాభాకు 5జీ కవరేజీని అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత చౌకధరలో డేటాను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిక్స్‌ దేశాల మధ్య డిజిటల్‌ ఎకోసిస్టంను ఏర్పరుచుకునేందుకు సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించనున్న 12వ బ్రిక్స్‌ కమ్యూనికేషన్స్‌ మంత్రుల సమావేశానికి సభ్యదేశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని ఆహ్వానించారు.

Updated Date - Jun 04 , 2025 | 05:12 AM