ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert: నేడు, రేపు భిన్న వాతావరణం

ABN, Publish Date - Apr 28 , 2025 | 03:20 AM

రాష్ట్రంలో నేడు, రేపు వాతావరణం మారుతూ, ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఉత్తరకోస్తా జిల్లాల్లో వర్షాలు, పిడుగులు పడే అవకాశముంది

  • భారీ ఉష్ణోగ్రతలు.. వర్షాలతో పిడుగులు పడే అవకాశం

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకోనే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉండగా, ఉత్తరకోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, అల్లూరి జిల్లాలో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. ఆదివారం కడపలో 42.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా రావికమతం, కడప జిల్లా వేంపల్లెలో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురముండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీలు, 55 ప్రాంతాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 28 , 2025 | 03:23 AM