Blast Aid Released: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
ABN, Publish Date - Apr 17 , 2025 | 05:56 AM
అనకాపల్లి జిల్లాలో బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందించిన హోం మంత్రి వంగలపూడి అనిత. మిగిలిన ఇద్దరికి కూడా త్వరలో చెక్కులు ఇవ్వనున్నట్టు తెలిపారు
రూ.15 లక్షల చొప్పున చెక్‌లు అందించిన హోం మంత్రి
కోటవురట, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ నెల 13న జరిగిన పేలుడులో మృతిచెందిన వారి కుటుంబాలకు హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం ఎక్స్‌గ్రేషియాచెక్కులు అందజేశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందగా.. వీరిలో కోటవురట్ల మండలానికి చెందినవారు ఆరుగురు ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో దేవర నిర్మలది కాకినాడ జిల్లా సామర్లకోట, మెడిసి హేమంత్ స్వస్థలం విశాఖ జిల్లా భీమిలి. వీరికి కూడా చెక్కులు అందిస్తామని చెప్పారు.
Updated Date - Apr 17 , 2025 | 05:56 AM