Tribute to Judge: జస్టిస్ పర్వతరావుకు హైకోర్టు ఘన నివాళి
ABN, Publish Date - May 09 , 2025 | 05:27 AM
మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.పర్వతరావుకు హైకోర్టులో ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య న్యాయమూర్తితో పాటు న్యాయవాదులు, అధికారులు ఆయన సేవలను స్మరించుకున్నారు
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ఇటీవల మృతి చెందిన అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్.పర్వతరావుకు హైకోర్టు ఘన నివాళులర్పించింది. ఈమేరకు గురువారం మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం తమ ప్రసంగాలలో జస్టిస్ పర్వతరావు అందించిన న్యాయసేవలను గుర్తు చేసుకున్నారు. పలు కీలక తీర్పులు ఇచ్చారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ విజయలక్ష్మి, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ధనంజయ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు, ప్రభుత్వ న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, కోర్టు ఉద్యోగులు, జస్టిస్ పర్వతరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - May 09 , 2025 | 05:27 AM